Colonel Tarunendra Pratap Singh | ఎవరీ కల్నల్ తరుణేంద్ర ప్రతాప్ సింగ్? ఐరాసలో ప్రసంగం కంటే.. చేతి మచ్చలే వైరల్..!
Colonel Tarunendra Pratap Singh | ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికపై భారత సైనిక అధికారి కల్నల్ తరుణేంద్ర ప్రతాప్ సింగ్ ఆకట్టుకున్నారు. ఆయన చేసిన ప్రసంగం కంటే చేతి వేళ్ల కణుపులపై కనిపించిన మచ్చలే సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఐరాస సమావేశంలో ఆయన పాల్గొన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఈ మచ్చలపై భిన్నంగా స్పందిస్తున్నారు.
Colonel Tarunendra Pratap Singh | ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికపై భారత సైనిక అధికారి కల్నల్ తరుణేంద్ర ప్రతాప్ సింగ్ ఆకట్టుకున్నారు. ఆయన చేసిన ప్రసంగం కంటే చేతి వేళ్ల కణుపులపై కనిపించిన మచ్చలే సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఐరాస సమావేశంలో ఆయన పాల్గొన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఈ మచ్చలపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇవి సైనికుల కఠోర శ్రమ, నిరంతర శారీరక శిక్షణ, క్రమశిక్షణకు ప్రతీకలని పలువురు ప్రశంసిస్తున్నారు. సైనిక జీవితంలోని కఠినమైన దినచర్యకు ఈ మచ్చలు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.
ఐరాసలో ఏం మాట్లాడారంటే..
ఐరాసలో భారత శాశ్వత మిషన్ మిలిటరీ అడ్వైజర్‌గా ఉన్న కల్నల్ తరుణేంద్ర ప్రతాప్ సింగ్.. శాంతి పరిరక్షక కార్యకలాపాల సమగ్ర సమీక్షపై నిర్వహించిన వార్షిక సదస్సులో ప్రసంగించారు. స్పష్టమైన కార్యాచరణ లక్ష్యం లేకుండా చేపట్టే శాంతి పరిరక్షక మిషన్లు వనరుల వృథాకు దారితీయడమే కాకుండా ఐరాస విశ్వసనీయతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. శాంతి పరిరక్షక దళాలకు తగిన వనరులు కల్పించాలని, వారి భద్రతను మరింత బలోపేతం చేయాలని, అన్ని దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు.
ఫిబ్రవరి నుంచి కీలక బాధ్యతలు
కల్నల్ తరుణేంద్ర ప్రతాప్ సింగ్ 2026 ఫిబ్రవరి 20న ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌కు మిలిటరీ అడ్వైజర్‌గా నియమితులయ్యారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, రక్షణ అంశాలకు సంబంధించిన చర్చలు, దౌత్యపరమైన కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షకుల భద్రతను పెంపొందించడంతోపాటు ఐరాస శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో భారత్ ప్రాధాన్యాలను బలోపేతం చేయాలని ఆయన సూచిస్తున్నారు.
VIDEO | New York, USA: India's Military Advisor to UN, Colonel Tarunendra Pratap Singh says peacekeeping missions without clear operational rationale drain resources and undermine credibility; calls for better-resourced, better-protected and more representative UN peacekeeping operations.
(Source: India at UN, NY's 'X' Handle)
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 6, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Schools 5 Day Week | తెలంగాణలో ఇకపై వారానికి 5 రోజులే స్కూళ్లు?
- ●SIR | రాజస్థాన్ ఓటర్ల జాబితాలో భారీ తేడా.. 30 లక్షల మంది పేర్లు మాయం
- ●Ram Gopal Varma Diwali Tweet | "చేతులు కాల్చుకునే వారికి నా విషెస్ వర్తించవు".. దీపావళి వేళ పొల్యూషన్, టపాసులపై ఆర్జీవీ ట్వీట్!
- ●Deepika Chikhli | సాయిపల్లవి యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Diwali Firecracker Safety Tips | టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవకండి.. కాలిన గాయాలకు టూత్‌పేస్ట్, ఐస్ పెడితే ఏమవుతుందో తెలుసా?
- ●Gadi Eizenkot | నెతన్యాహుకు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎయిజెన్కాట్కు తొలి అవకాశం

Telangana Schools 5 Day Week | తెలంగాణలో ఇకపై వారానికి 5 రోజులే స్కూళ్లు?

SIR | రాజస్థాన్ ఓటర్ల జాబితాలో భారీ తేడా.. 30 లక్షల మంది పేర్లు మాయం

Ram Gopal Varma Diwali Tweet | "చేతులు కాల్చుకునే వారికి నా విషెస్ వర్తించవు".. దీపావళి వేళ పొల్యూషన్, టపాసులపై ఆర్జీవీ ట్వీట్!

Deepika Chikhli | సాయిపల్లవి యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు




