Tollywood | చిరు, వెంకీ , నాగ్, బాలయ్య కలిసి నటించిన ఒకే ఒక తెలుగు సినిమా ఏదో తెలుసా!
టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున కలయిక సినిమా రావాలన్నది అభిమానుల కల. కానీ ఈ నలుగురు హీరోలు కలిసి ఓ సినిమా చేశారు. వెంకటేష్ హీరోగా నటించిన ఓ సినిమాలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున గెస్ట్ రోల్స్ చేశారు. ఆ సినిమా ఏదంటే?
Entertainment | Published On Apr 14, 2026, 7.07 pm IST
Tollywood | టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాలన్నది తెలుగు సినీ అభిమానుల చిరకాల కల. ఈ నలుగురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వారి కోరిక మాత్రం నెరవేరడం లేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమాను రూపొందించాలని కొందరు నిర్మాతలు ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. చాలా ఏళ్ల క్రితమే ఈ నలుగురు టాప్ హీరోలు ఓ తెలుగు సినిమాలో నటించారు. అయితే హీరోలుగా కాదు గెస్ట్ రోల్స్ చేశారు.
మల్టీస్టారర్ మూవీ...
వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా సీనియర్ డైరెక్టర్ కే మురళీమోహన్ రావు డైరెక్షన్‌లో తెలుగులో త్రిమూర్తులు పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కింది. 1987లో రిలీజైన ఈ సినిమాను సుబ్బిరామిరెడ్డి నిర్మించారు.బాలీవుడ్‌లో విజయవంతమైన నసీబ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ గెస్ట్ రోల్స్‌లో కనిపించారు.
25 మంది స్టార్స్...
ఈ సినిమాలోని ఒకే మాట ఒకే బాట పాటలో కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజుతో పాటు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, విజయశాంతి, రాధిక సహా టాప్ హీరోహీరోయిన్లందరూ నటించారు. నిర్మాత సుబ్బిరామిరెడ్డితో ఉన్న అనుబంధం కారణంగా గెస్ట్‌లుగా నటించడానికి నాయకానాయికలందరూ అంగీకరించారు. దాదాపుగా ఇరవై ఐదు మంది స్టార్స్ ఈ పాటలో నటించడం గమనార్హం. రిలీజ్‌కు ముందు ఈ పాట హాట్ టాపిక్‌గా మారింది. అభిమాన హీరోలందరిని ఒకే సినిమాలో చూసి ఫ్యాన్స్ థ్రిల్లయ్యారు. కానీ కమర్షియల్‌గా మాత్రం త్రిమూర్తులు డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక సినిమాగా మాత్రం నిలిచింది. ఈ సినిమాకు బప్పిలహరి మ్యూజిక్ అందించారు.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



