త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Rashmika Wedding | విజ‌య్ -ర‌ష్మిక వెడ్డింగ్ కార్డ్ బాక్స్‌.. అతిథుల‌కు విలువైన బ‌హుమ‌తులు..!

Vijay Rashmika Wedding | టాలీవుడ్ స్టార్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) పెళ్లి చేసుకోబోతున్నార‌న్న విష‌యం తెలిసిందే. తాజాగా వీరి వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

D

Movies | Published On Feb 19, 2026, 10.38 am IST

Vijay Rashmika Wedding | విజ‌య్ -ర‌ష్మిక వెడ్డింగ్ కార్డ్ బాక్స్‌.. అతిథుల‌కు విలువైన బ‌హుమ‌తులు..!
Advertisement

Vijay Rashmika Wedding | టాలీవుడ్ స్టార్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) పెళ్లి చేసుకోబోతున్నార‌న్న విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 26న వీరి వివాహం ఉద‌య్‌పూర్ (Udaipur) వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. ఈ నేప‌థ్య‌లో ఇప్ప‌టికే ఇరు కుటుంబ స‌భ్యులు పెళ్లి ప‌నులు మొద‌లు పెట్టేశారు. హైద‌రాబాద్‌లోని విజ‌య్ ఇంటిని విద్యుత్ దీపాల‌తో సుంద‌రంగా అలంక‌రించారు. ఇక సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా వీరి పెళ్లి గురించే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. రోజుకో కొత్త వార్త షికారు చేస్తోంది. తాజాగా వీరి వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆహ్వానితుల‌కు ప్ర‌త్యేక‌పై ఇన్విటేష‌న్స్‌ను పంపిన‌ట్లు తెలిసింది. ఓ బాక్స్‌ (Vijay Rashmika Wedding Card Box)లో ఇన్విటేష‌న్ కార్డుతోపాటూ కొన్ని స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్స్‌ను కూడా పంపిన‌ట్లు స‌మాచారం. ఆ గిఫ్ట్ బాక్స్‌లో ఉన్న బ‌హుమ‌తులు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. రష్మిక ప్రారంభించనున్న పెర్ఫ్యూమ్ బ్రాండ్‌కు చెందిన “నేషనల్ క్రష్” పేరుతో ఒక మినీ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను అతిథుల‌కు పంపిన‌ట్లు తెలిసింది. వాటితోపాటూ విజయ్‌కు చెందిన ప్రసిద్ధ ‘రౌడీ’ బ్రాండ్ టీ-షర్ట్‌, జీడిపప్పు ప్యాకెట్, ఒక స్వీట్ బాక్స్‌, చేతులు, కాళ్లకు ఉపయోగించే ఒక ఆయుర్వేదిక్ క్రీమ్‌ను కూడా వెడ్డింగ్ కార్డుతోపాటూ బాక్స్‌లో ప్యాక్ చేసి సెండ్ చేశారు. ఈ ప్రత్యేక వెడ్డింగ్ కార్డ్ బాక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లగ్జరీ బాక్స్‌కే చాలా ఖర్చు అయిన‌ట్లు టాలీవుడ్‌లో టాక్ న‌డుస్తోంది.

https://x.com/Rashmikadelhifc/status/2024143209182695743

నో ఫోన్స్‌, నో సెలబ్రిటీ గెస్ట్స్‌..

వీరి పెళ్లి చాలా ప్రైవేట్‌గా జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిసింది. ఇరు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే వేడుక‌కు హాజ‌రుకానున్నార‌ట‌. పెళ్లి ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు రాకుండా విజ‌య్‌-ర‌ష్మిక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిసింది. అందుకే ఈవెంట్‌లో నో ఫోన్ పాల‌సీని అమ‌లు చేసిన‌ట్లుగా సన్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు, ఈ వేడుక‌కు స్టార్ హీరోలు, హీరోయిన్‌లు, ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఏ ఒక్క‌రినీ ఆహ్వానించ‌లేద‌ట‌. అతిథుల జాబితాలో కేవ‌లం కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఉండ‌టం విశేషం. దీన్ని బ‌ట్టే తెలుస్తోంది.. ర‌ష్మిక‌-విజ‌య్ జంట వారి పెళ్లిని ఎంత ప్రైవేట్‌గా చేస‌కుంటున్నార‌న్న‌ది. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ విష‌యాన్ని బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. పెళ్లి అనంత‌రం ఈ జంట అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement