Anjali Heroine in Makutam | విశాల్ ‘మకుటం’లో హీరోయిన్గా అంజలి.. నవ్వులు పూయిస్తున్న కాన్సెప్ట్ వీడియో!
యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'మకుటం' చిత్రంలో హీరోయిన్గా అంజలి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్రయూనిట్ విడుదల చేసిన ఓ ఫన్నీ కాన్సెప్ట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Anjali Heroine in Makutam | త్రినేత్ర.న్యూస్ : విశాల్, అంజలి కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్.బి. చౌదరి నిర్మాణంలో వస్తున్న 99వ చిత్రం ‘మకుటం’. యాక్షన్ హీరో విశాల్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్, పోస్టర్లు చూస్తుంటే ఇదొక విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది. తాజాగా ఈ మూవీలో హీరోయిన్గా అంజలి నటించనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రకటన కోసం విశాల్, అంజలి కలిసి చేసిన ఓ కాన్సెప్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియోలో దర్శకుడి అవతారంలో ఉన్న విశాల్.. హీరోయిన్ అంజలి వద్దకు వెళ్లి కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. "కథ చెప్పండి డైరెక్టర్ గారు" అని అంజలి అడగ్గానే.. "ఒక అందమైన గ్రామం.." అంటూ విశాల్ మొదలుపెడతాడు. వెంటనే అంజలి కల్పించుకుని "అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా.. ముందు మీరు కథ చెప్పండి" అంటూ కౌంటర్ వేస్తుంది. విశాల్ అలా ఏదోదో చెబుతుండగా మధ్యలో అంజలి సెటైర్లు వేయడం, చివరికి "అసలు మీ దగ్గర కథ ఉందా?" అని ఆమె అడిగేసరికి విశాల్ అక్కడి నుంచి పారిపోవడం.. ఈ వీడియోలో ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

"మంచి కథ అని మేనేజర్ చెప్పారే.. విశాల్ ఏంటి ఇలా చెబుతున్నాడు" అని అంజలి అనుకుంటుండగా.. "కథ అడుగుతోందే.. ఎలా.. రేపు వచ్చి మరో కథ చెబుదాం" అని విశాల్ అక్కడినుంచి మెల్లగా జారుకోవడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినూత్నంగా ప్లాన్ చేసిన ఈ కాన్సెప్ట్ వీడియో ద్వారా సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు విశాల్ స్వయంగా స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
A Hilarious Announcement@yoursanjali Comes On Board For #Makutam & @VishalKOfficial ’s Narrative Generates Laughs#MAGUDAM #Vishal35 #SGF99 @officialdushara @iyogibabu @dir_raviarasu @SuperGoodFilms_ #SampathRaj @Richardmnathan @srikanth_nb @g_durairaj @dhilipaction… pic.twitter.com/FLdpkPWYLx
— Suresh Kondeti (@santoshamsuresh) April 25, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



