త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay – Trisha | దళపతి విజయ్, త్రిష పెళ్లి ఫిక్సయ్యిందా? – హింట్ ఇచ్చిన త్రిష త‌ల్లి

ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో రూమ‌ర్లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా త్రిష త‌ల్లి వీరి పెళ్లిపై ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేసింది.

N

Entertainment | Published On Mar 17, 2026, 1.02 pm IST

Vijay – Trisha | దళపతి విజయ్, త్రిష పెళ్లి ఫిక్సయ్యిందా? – హింట్ ఇచ్చిన త్రిష త‌ల్లి
Advertisement

Vijay - Trisha |  ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష పెళ్లి ఫిక్స‌యిన‌ట్లు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ అత‌డి భార్య సంగీత ఇటీవ‌లే కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. విజ‌య్‌కి ఓ హీరోయిన్‌తో వివాహేత‌ర సంబంధం ఉందంటూ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది సంగీత‌. ఆ హీరోయిన్ త్రిష‌నే అంటూ కోలీవుడ్‌లో రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. ఈ పుకార్ల న‌డుమ ఓ నిర్మాత కొడుకు వెడ్డింగ్ రిసెప్ష‌న్‌కు విజ‌య్‌, త్రిష జంట‌గా హాజ‌రుకావ‌డం కోలీవుడ్ నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇన్‌డైరెక్ట్‌గా త్రిష‌తో బంధంపై ఈ పెళ్లి వేడుక ద్వారా విజ‌య్ క్లారిటీ ఇచ్చాడంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్నిక‌ల త‌ర్వాత పెళ్లి....

కాగా భార్య సంగీత‌కు విడాకులు ఇచ్చి త్రిష‌ను విజ‌య్ పెళ్లిచేసుకోనున్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఎన్నిక‌ల త‌ర్వాత ఈ జంట పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. కాగా త్రిష త‌ల్లి ఉమా కృష్ణ‌న్ ఇన్‌డైరెక్ట్‌గా వీరిద్ద‌రి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది.

వీడియోకు లైక్‌...

విజ‌య్‌, త్రిష పెళ్లిచేసుకోబోతుండ‌టం నిజ‌మేనంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోకు త్రిష త‌ల్లి ఉమా కృష్ణ‌న్ లైక్ కొట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. టీవీకే అధినేత‌తో కూతురు పెళ్లి త‌న‌కు ఇష్ట‌మేనంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఈ లైక్ ద్వారా త్రిష త‌ల్లి హింట్ ఇచ్చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. త్రిష ఫ్యామిలీ నుంచి ఈ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు, అభ్యంత‌రాలు ఉండ‌వ‌ని తేలిపోయింద‌ని చెబ‌తున్నారు. విడాకులకు సంబంధించిన లీగ‌ల్ ఇష్యూస్ క్లియ‌ర్ త‌ర్వాతే వెడ్డింగ్‌పై ఫుల్ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

కేసు హియ‌రింగ్‌...

విజ‌య్ విడాకుల కేసు హియ‌రింగ్ ఏప్రిల్ 20న ఉంది. ఏప్రిల్ 23న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎలెక్ష‌న్స్ జ‌రుగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో విజ‌య్ టీవీకే పార్టీ ఫ‌స్ట్ టైమ్ పోటీచేయ‌బోతున్న‌ది. విడాకుల కేసు ప్ర‌భావం విజ‌య్‌తో పాటు అత‌డి పార్టీపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉందంటూ వార్త‌లొస్తున్నాయి. మే 4న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. అదే రోజు త్రిష బ‌ర్త్‌డే కావ‌డం గ‌మ‌నార్హం. అదే రోజు విజ‌య్ రాజ‌కీయ భ‌విత‌వ్యం తేల‌నుంది. అంతే కాకుండా త్రిష‌తో పెళ్లిపై కూడా స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రావ‌చ్చున‌ని అంటున్నారు.

 

Advertisement
Advertisement