kollywood | కోలీవుడ్‌లో విషాదం – సీనియర్ నిర్మాత ఆత్మహత్య – కెరీర్ మొత్తం వివాదాలే…
కోలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కే రాజన్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అడయార్ బ్రిడ్జ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. తమిళంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలు చేశారు రాజన్.
Entertainment | Published On May 17, 2026, 7.10 pm IST
kollywood | తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ప్రొడ్యూసర్, నటుడు కే రాజన్ (85) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం అడయార్ బ్రిడ్జ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. కే రాజన్ సూసైడ్ కోలీవుడ్‌లో కలకలాన్ని రేపుతోంది. కే రాజన్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. 85 ఏళ్ల వయసులో సూసైడ్ ఎందుకు చేసుకున్నారనే దానిపై విచారణ జరుపుతున్నారు.
యాక్టర్ కమ్ డైరెక్టర్...
యాక్టర్‌గానే కాకుండా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్‌గా పలు సినిమాలు చేసిన కే రాజన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. ప్రొడ్యూసర్‌గా తమిళంలో డబుల్స్, అవల్ పావమ్, నినైక్కాథా నాలిల్లై సినిమాలు నిర్మించారు. దర్శకుడిగా నమ్మ ఊరు మారియమ్మ, ఉనార్చిగల్ తెరకెక్కించారు. తెలుగు నిర్మాత డీ రామానాయుడు నిర్మించిన మైఖేల్ రాజ్ మూవీతో యాక్టర్‌గా మారారు కే రాజన్. ఎన్ సఖియే, డబుల్స్, కబడ్డీ కబడ్డీ, వెట్టోడా మాప్పిళ్లై, గిరివలం, నడిగై, పాంబు సట్టై, తునివు, బకాసురన్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్...
కే రాజన్‌కు కుమారుడు ప్రభుకాంత్ ఉన్నాడు. తనయుడిని హీరోగా పెట్టి అవల్ పావమ్ అనే సినిమాను నిర్మించారు. రాజన్ సినీ జీవితం మొత్తం వివాదాలతోనే సాగింది. తమిళ సినీ పరిశ్రమతో పాటు అగ్ర హీరోహీరోయిన్లు, దర్శకుల గురించి పలుమార్లు రాజన్ చేసిన కామెంట్లు, ఇచ్చిన స్టేట్‌మెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయిపై రాజన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ నిర్మాతపై దాడి చేసిన కేసులో 2001లో అరెస్ట్ అయ్యాడు. కమల్ హాసన్, ధనుష్, గౌతమ్ మీనన్‌తో పాటు పలువురు స్టార్స్‌పై విమర్శలు చేశారు. రెమ్యూనరేషన్ విషయంలో నయనతారపై అనుచిత కామెంట్లు చేశాడు రాజన్
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



