Karthika Pournami | కార్తీకపౌర్ణమి.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ
Karthika Pournami | కార్తీకపౌర్ణమి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు బారులుతీరారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. వేకువజామునే పుణ్యస్నానమచరించి, దీపారాధన (Karthika deepam) చేస్తున్నారు.
Karthika Pournami | త్రినేత్ర న్యూస్: కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినం కార్తీక పౌర్ణమి (Karthika Pournami) . శివకేశకులకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజు శివుడు త్రిపురాసురులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించిన పవిత్ర తిథిగా కూడా భక్తులు భావిస్తారు. కార్తీకపౌర్ణమి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు బారులుతీరారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. వేకువజామునే పుణ్యస్నానమచరించి, దీపారాధన (Karthika deepam) చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపాంతలు వెలిగించడంతో ఆలయం దీపకాంతులతో వెలుగొందింది.

భద్రాచలంలోని పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలాచరించారు. వేకువజాము నుంచే పుణ్యస్నానాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరిస్తూ నదిలో కార్తికదీపాలు వదులుతున్నారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, మంథని వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో దీపాలను వదిలారు.

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కీసరగుట్ట, వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. వేములవాడలో భక్తులు కోడె మొక్కులు చెల్లించుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. హైదరాబాద్లోని శివుని ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది. ఉదయం నుంచే ఆయాల్లో భక్తులు బారులు తీరారు. మహాదేవుడికి భక్తిశ్రద్ధలతో జలాభిషేకాలు, దీపారాధన చేస్తున్నారు.



అరుణాచలంలో..
ఇక తమిళనాడులోని తిరువణ్ణామలై (Arunachalam)లో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. తెల్లవారుజామున సుమారు 4 గంటలకు అరుణాచలేశ్వరుడి గర్భగుడిలో ఐదు అగ్ని దీపాలతో భరణి దీపాన్ని వెలిగించారు. లక్షలాది మంది భక్తులు అరుణాచల కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. కాగా, సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఆలయంలో అర్ధనారీశ్వర స్వామి దర్శనం అనంతరం, 2,668 అడుగుల ఎత్తయిన అరుణాచల కొండ శిఖరంపై భారీ రాగి పాత్రలో వేలాది కిలోల నెయ్యి, వందల మీటర్ల వస్త్రపు వత్తితో మహా దీపాన్ని వెలిగించనున్నారు.
Tiruvannamalai Karthigai Deepam Today 🙌
As the sacred Maha Deepam shines atop Arunachala Hill, countless devotees offer their prayers to Sri Arunachaleswarar.
One holy flame, countless blessings and an ocean of devotion. https://t.co/BEMOYTAhEi
— Akanksha Parmar (@iAkankshaP) November 24, 2026
సంబంధిత వార్తలు

Karthika Pournami | నేడే కార్తీక పౌర్ణమి.. ఏ సమయంలో దీపారాధన చేయాలి? జ్వాలాతోరణం వెనుక ఆసక్తికర విషయాలు తెలుసా..?
నవంబర్ 24, 2026

Srisailam Temple | శ్రీశైలంలో భక్తజన సందోహం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత!
నవంబర్ 23, 2026

Yadagirigutta | యాదగిరిగుట్టలో ఘనంగా కార్తీక మాస ఉత్సవాలు
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Special Trains | పండుగల రద్దీ.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!
- ●Vaikunta Dwara Darshan | శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు.. 27న వైకుంఠద్వార దర్శన టికెట్లు రిలీజ్!
- ●Harish Rao | మంజీరా జలాల భారీ దోపిడీ.. ప్రజల దాహం కంటే పరిశ్రమల లాభాలే ముఖ్యమా?: హరీశ్ రావు
- ●BHEL | బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు.. 415 ట్రైనీ పోస్టులతో నోటిఫికేషన్
- ●Deeksha Divas | తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన పదకొండు రోజులు
- ●Remedies | కార్తీక పౌర్ణమి వేళ ఈ 5 పరిహారాలు పాటించండి.. లక్ష్మీ కటాక్షంతో సిరిసంపదలు మీ సొంతం!

Special Trains | పండుగల రద్దీ.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!

Vaikunta Dwara Darshan | శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు.. 27న వైకుంఠద్వార దర్శన టికెట్లు రిలీజ్!

Harish Rao | మంజీరా జలాల భారీ దోపిడీ.. ప్రజల దాహం కంటే పరిశ్రమల లాభాలే ముఖ్యమా?: హరీశ్ రావు

BHEL | బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు.. 415 ట్రైనీ పోస్టులతో నోటిఫికేషన్



