త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crime Thriller OTT | మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌రుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ

వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ కానిస్టేబుల్ ఓటీటీలోకి రాబోతుంది. జ‌న‌వ‌రి 29 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో మ‌ధులిక వార‌ణాసి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Entertainment | Published On Jan 28, 2026, 5.28 pm IST

Crime Thriller OTT | మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌రుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ
Advertisement

Crime Thriller OTT | వ‌రుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా న‌టించిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ కానిస్టేబుల్ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి (OTT) వ‌స్తోంది. ఈ సినిమాకు ఆర్య‌న్ సుభాన్ ఎస్‌కే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో కానిస్టేబుల్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జ‌న‌వ‌రి 29 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఫ‌స్ట్ టైమ్‌...

కానిస్టేబుల్ మూవీలో మ‌ధులిక వార‌ణాసి హీరోయిన్‌గా న‌టిస్తోంది. సూర్య‌, క‌ల్ప‌ల‌త‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తెలుగులో ఎక్కువ‌గా ల‌వ్‌స్టోరీస్‌, రొమాంటిక్ మూవీస్ చేసిన వ‌రుణ్ సందేశ్...ఫ‌స్ట్ టైమ్ ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ క‌థాంశంతో ఈ సినిమా చేశారు. జాన‌ర్ మార్చిన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు. కానిస్టేబుల్ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

కానిస్టేబుల్ మూవీ క‌థ‌...

శంక‌ర్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో కాశీ (వ‌రుణ్ సందేశ్‌) కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తుంటాడు. ఆ ఊరిలో వ‌రుస‌గా హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఈ హ‌త్య‌లు చేస్తున్నాడ‌ని పోలీసుల అన్వేష‌ణ‌లో తేలుతుంది. కాశీ మేన‌కోడ‌లు కీర్తిని కూడా ఆ కిల్ల‌ర్ చంపేస్తాడు? దాంతో ఈ కేసును ప‌ర్స‌న‌ల్‌గా తీసుకున్న కాశీ కిల్ల‌ర్‌ను ఎలా ప‌ట్టుకున్నాడు? ఆ హంత‌కుడి గురించి కాశీకి ఎలాంటి షాకింగ్ నిజం తెలిసింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

వెబ్ సిరీస్‌లు సినిమాలు...

ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలుగులో వ‌రుణ్ సందేశ్ వ‌రుస‌గా అవ‌కాశాల‌ను అందుకుంటున్నాడు. సినిమాల‌తో పాటు వెబ్‌సిరీస్‌ల‌లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే న‌య‌నం అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ప్ర‌స్తుతం హ‌ల్లో ఇట్స్ మీతో పాటు డియ‌ర్ ఆస్ట్రోనాట్ సినిమాలు చేస్తున్నాడు. డియ‌ర్ ఆస్ట్రోనాట్ మూవీలో వ‌రుణ్ సందేశ్ భార్య వితికా శేరు హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement