Trisha | ఇంకోసారి అలా మాట్లాడొద్దు..త్రిష వార్నింగ్
విజయ్, త్రిష బంధంపై ఇటీవల తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కామెంట్లపై త్రిష తరఫున ఆమె లాయర్ క్లారిటీ ఇచ్చాడు. త్రిషకు సంబంధం లేని విషయాల్లో ఆమె పేరును లాగవద్దని అన్నారు. త్రిషకు ఏ పొలిటికల్ పార్టీతోనూ సంబంధం లేదని తెలిపారు.
Entertainment | Published On Feb 16, 2026, 2.12 pm IST
Trisha | దళపతి విజయ్‌తో సౌత్ క్వీన్ త్రిష డేటింగ్‌లో ఉన్నట్లుగా చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఇప్పటివరకు ఐదు సినిమాల్లో నటించారు. మూడేళ్ల క్రితం రిలీజైన లియో సినిమాలో విజయ్ సరసన త్రిష నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య బంధం బలపడిందని ప్రచారం జరిగింది. విజయ్, త్రిష జంటగా పలుమార్లు వెకేషన్స్‌కు వెళ్లినట్లుగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. త్రిష కారణంగానే విజయ్ తన భార్య సంగీతతో పాటు పిల్లలకు దూరమైనట్లుగా కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బీజేపీ ప్రెసిడెంట్...
విజయ్, త్రిష బంధంపై ఇటీవల తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి. ఇటీవలే టీవీకే పేరుతో విజయ్ పొలిటికల్ పార్టీని స్థాపించాడు. కొద్ది రోజుల్లోనే అతడి పార్టీకి ప్రజాదరణ లభిస్తోంది. రాజకీయాల పరంగా విజయ్‌కి లభిస్తోన్న క్రేజ్‌పై తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ "తమిళనాడు రాజకీయాల గురించి విజయ్‌కి అర్థం కావాలంటే ముందు త్రిష ఇంట్లో నుంచి అతడు బయటకు రావాలి. హీరోయిన్‌తో ఉన్న బంధాన్ని తెంచుకొని తన కుటుంబంతో తిరిగి కలిసిపోయిన తర్వాత రాజకీయాల గురించి విజయ్ ఆలోచిస్తే మంచిది అంటూ కామెంట్స్ చేశాడు. నైనార్ నాగేంద్రన్ కామెంట్లు తమిళనాట దుమారాన్ని రేపుతోన్నాయి. తమ రాజకీయాల కోసం త్రిషను మధ్యలోకి లాగడం కరెక్ట్ కాదని ఆమె అభిమానులు ఫైర్ అవుతోన్నారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని అంటున్నారు.
లాయర్ ద్వారా...
నైనార్ నాగేంద్ర వ్యాఖ్యలపై త్రిష క్లారిటీ ఇచ్చింది. తన లాయర్ ద్వారా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఈ లెటర్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. త్రిష గురించి మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రచారంలో ఉన్నాయని, అవన్నీ అవాస్తవాలేనని త్రిష లాయర్ నిత్యేష్ నటరాజ్ ఈ లేఖలో పేర్కొన్నారు.
పాలిటిక్స్‌పై ఆసక్తి లేదు...
రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక నాయకుడు త్రిష గురించి ఇలాంటి అసభ్యకరమైన కామెంట్లు చేయడం దారుణమని ఈ లేఖలో లాయర్ పేర్కొన్నారు. తన క్లయింట్ అయిన త్రిషకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, తనకు పార్టీతోనూ సంబంధంలేదని చెప్పారు. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచన ఆమెకు లేదని అన్నారు. ఏ పార్టీని సపోర్ట్ చేయకుండా రాజకీయాల విషయంలో త్రిష ఎప్పుడు తటస్థంగానే ఉంటూ వచ్చారని లాయర్ నిత్యేష్ నటరాజ్ తెలిపారు. సినిమాల ద్వారానే తనకు గుర్తింపు, పేరుప్రఖ్యాతులు రావాలని త్రిష కోరుకున్నారు తప్పితే ఇలాంటి స్వార్థ రాజకీయాలతో కాదని నిత్యేష్ నటరాజ్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసేముందు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతయుతంగా వ్యవహరిస్తే బాగుంటుందని అన్నారు. తన క్లయింట్ త్రిషకు సంబంధం లేని విషయాల్లోకి ఆమె పేరును లాగవద్దని లాయర్‌హెచ్చరించారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం త్రిష పేరును వాడటం, ఆమెపై అసభ్యకరమైన కామెంట్లను చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నిత్యేష్ నటరాజ్ అన్నారు. లాయర్ ప్రకటనను త్రిష కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఎవరూ చేసిన వాటిని ఖండించాల్సిందేనని త్రిష కూడా లాయర్ ప్రకటనను ఉద్దేశించి కామెంట్ చేసింది.
 
Disrespect should and always will be called out. pic.twitter.com/FmXdIBvAJ6
— Trish (@trishtrashers) February 16, 2026
;
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



