Trisha | పెళ్లి చేసుకున్నా…పిల్లలను కన్నా – త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్…
చెన్నై క్వీన్ త్రిష సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందంటూ కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై త్రిష రియాక్ట్ అయ్యింది. తాను ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లిచేసుకున్నానని, తమకు నలుగురు పిల్లలు పుట్టారంటూ సెటైరికల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
Entertainment | Published On Apr 7, 2026, 2.08 pm IST
Trisha | సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు వస్తోన్న రూమర్లపై సౌత్ క్వీన్ త్రిష రియాక్ట్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. టీవీకే అధినేత, కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్‌తో త్రిష బంధంపై గత కొద్ది నెలలుగా తమిళ సినీ పరిశ్రమలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవలే దళపతి విజయ్‌తో కలిసి ఓ నిర్మాత కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్‌కు త్రిష అటెండ్ కావడం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి త్రిష వ్యక్తిగత జీవితంపై రోజుకో వార్త వైరల్ అవుతోంది. విజయ్, త్రిష పెళ్లిచేసుకోబోతున్నట్లు...టీవీకే పార్టీ నుంచి చెన్నై క్వీన్ పోటీ చేయనుందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొననుందని...ఇలా అనేక పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై త్రిష మాత్రం సెలైంట్‌గా ఉంటూ వస్తోంది.
సినిమాలకు దూరం...
తాజాగా త్రిష సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త సినిమాలేవి త్రిష అంగీకరించడం లేదని, తన దగ్గరకు వచ్చిన దర్శకనిర్మాతలకు కూడా ఇకపై తాను సినిమాలు చేయనని చెప్పుతుందంటూ తమిళ డైరెక్టర్ చిత్రా లక్ష్మణన్ కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యలు నిజమేనని దక్షిణాది సినీ వర్గాలు భావించాయి.
బిజినెస్‌మెన్‌ను పెళ్లిచేసుకున్నా...
తాజాగా ఈ రూమర్లపై త్రిష ఫన్నీగా రియాక్ట్ అయ్యింది. చిత్రా లక్ష్మణన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. "నేను సినిమాలకు గుడ్‌బై చెప్పేశానట. కోటీశ్వరుడైన రిచ్ బిజినెస్‌మెన్‌ను పెళ్లిచేసుకున్నానట. మాకు పుట్టిన నలుగురు పిల్లలకు నిన్ననే రెండేళ్లు నిండాయట. ఈ రోజు కట్టుకథలకు...ఊహాగానాలకు ఇవి సరిపోతాయా..ఇంకేమైనా జోడించాలా?" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వ్యంగ్యంగా ఓ పోస్ట్ పెట్టింది త్రిష. చెన్నై క్వీన్ పోస్ట్ వైరల్ అవుతోంది. తాను సినిమాలకు దూరం కావడం లేదని ఈ పోస్ట్ ద్వారా త్రిష సమాధానమిచ్చిందని నెటిజన్లు అంటున్నారు. దళపతి విజయ్‌తో పెళ్లి అంటూ వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టిందని చెబుతున్నారు.
చిరంజీవి విశ్వంభర...
ప్రస్తుతం త్రిష తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తోంది. దాదాపు 19 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వేసవిలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు తమిళంలో సూర్యతో కరుప్పు సినిమా చేసింది త్రిష. మే 14న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



