త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Highest Grossing Movie | అవ‌తార్ 3, జురాసిక్ పార్క్‌కు షాకిచ్చిన యానిమేష‌న్ మూవీ – 18 వేల కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ర‌చ్చ‌

2025 వ‌ర‌ల్డ్ వైడ్‌గా హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమా ఓ యానిమేష‌న్ సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. చైనీస్ యానిమేష‌న్ మూవీ నేజా 2 వ‌ర‌ల్డ్ వైడ్‌గా 18000 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నేజా 2కు అవ‌తార్ 3, సూప‌ర్ మ్యాన్ లాంటి సినిమాలు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి.

N

Entertainment | Published On Dec 29, 2025, 7.25 pm IST

Highest Grossing Movie | అవ‌తార్ 3, జురాసిక్ పార్క్‌కు  షాకిచ్చిన యానిమేష‌న్ మూవీ – 18 వేల కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ర‌చ్చ‌

నేజా 2

Advertisement

Highest Grossing Movie |  యానిమేష‌న్‌ మూవీస్‌ను చాలా మంది చిన్న పిల్ల‌లు చూసే సినిమాలంటూ తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఈ యానిమేష‌న్ మూవీస్ ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఓ చైనీస్ యానిమేష‌న్ మూవీ అవ‌తార్‌ 3, సూప‌ర్ మ్యాన్, ఎఫ్ 1 లాంటి సినిమాల‌కు షాకిచ్చింది. హాలీవుడ్ సినిమాల‌ను దాటేసి వ‌ర‌ల్డ్ వైడ్‌గా 2025 లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాగా చ‌రిత్ర‌ను సృష్టించింది. దిగ్గ‌జ ద‌ర్శ‌కులు, హీరోలు సైతం సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆ సినిమానే నేజా 2.
ఈ చైనీస్ యానిమేష‌న్ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 18000 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ర‌చ్చ చేసింది. చైనీస్ పురాణాల్లోనే నేజా అనే క్యారెక్ట‌ర్ ఆధారంగా ఈ యానిమేష‌న్ మూవీని డైరెక్ట‌ర్ జియోజీ తెర‌కెక్కించారు. తొలి వారంలో ఈ యానిమేష‌న్ మూవీని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించ‌కోలేదు. కాన్సెప్ట్‌తో పాటు పురాణాల‌ను నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా చెప్పిన తీరు, విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. రెండో వారం నుంచి వ‌సూళ్లు క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చాయి.కుటుంబ విలువ‌లు, త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నం లాంటి అంశాల‌ను హృద‌యాల‌ను క‌దిలించేలా ఈ సినిమాలో చూపించ‌డంతో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు.

ఫ‌స్ట్ ప్లేస్‌...

కేవ‌లం ఏడు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన నేజా 2 ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో 18000 కోట్ల‌తో చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది. ఈ ఏడాది వ‌ర‌ల్డ్ వైడ్‌గా హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. నేజా 2 త‌ర్వాత హాలీవుడ్ యానిమేష‌న్ మూవీ జూటోపియా 2 క‌లెక్ష‌న్స్ లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. లిలో అండ్ స్ట్రిచ్ , ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
వ‌ర‌ల్డ్ వైడ్‌గా హ‌య్యెస్ట్ గ్రాసింగ్‌ సినిమాల్లో నేజాతో పాటు జ‌ప‌నీస్ యానిమేటేడ్ మూవీ డెమాన్ స్లేయ‌ర్స్ కూడా కుమ్మేసింది. ఈ సినిమా ఆరో ప్లేస్‌లో నిలిచింది. జురాసిక్ వ‌ర‌ల్డ్ రీబ‌ర్త్ ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది.

టాప్ టెన్‌లో అవ‌తార్‌...

జేమ్స్ కామ‌రూన్ అవ‌తార్ ఫైర్ అండ్ యాష్‌, బ్రాడ్ పిట్ ఎఫ్ 2, సూప‌ర్ మ్యాన్ సినిమాలు టాప్ టెన్‌లో చోటు ద‌క్కించుకున్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా క‌లెక్ష‌న వ‌ర్షం కురిపించిన నేజా 2 మాత్రం ఇండియ‌న్ ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక‌పోయింది. తొలిరోజు అతి క‌ష్టంగా యాభై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఇండియాలో ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో ఈ మూవీ నాలుగైదు కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

Advertisement
Advertisement