Faria Abdullah | ఖాళీ దొరికితే సెట్స్‌లో అదే పని చేస్తుంటా – సీక్రెట్ బయటపెట్టిన జాతిరత్నాలు బ్యూటీ
Faria Abdullah | జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా మెగాఫోన్‌పై మనసు పడింది. డైరెక్టర్‌గా మారే ప్రయత్నాల్లో ఉన్న ఈ బ్యూటీ కథలు రాస్తుందట. ఈ సీక్రెట్‌ను గుర్రం పాపిరెడ్డి ప్రమోషన్స్‌లో బయటపెట్టింది.
Entertainment | Published On Dec 18, 2025, 7.51 pm IST
Faria Abdullah
నేటితరం హీరోయిన్లు కేవలం యాక్టింగ్‌కే పరిమితం కావడానికి ఇష్టపడటం లేదు. కెమెరా ముందు నటించడమే కాకుండా తెర వెనుక ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నారు. అవకాశం లభిస్తే డైరెక్టర్లుగా, రైటర్లుగా సత్తా చాటడానికి రెడీ అంటున్నారు. కీర్తి సురేష్ మెగాఫోన్ పట్టే ప్రయత్నాల్లో ఉంది. ఆమె బాటలోనే జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా అడుగులు వేయబోతుంది.
ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన గుర్రం పాపిరెడ్డి మూవీ డిసెంబర్ 19న రిలీజ్ కాబోతుంది. నరేష్ అగస్త్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో యోగిబాబు, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. గుర్రం పాపిరెడ్డి ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాతో పాటు తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఫరియా అబ్దుల్లా.
డాక్టర్ కావాలని...
గుర్రం పాపిరెడ్డిలో సౌధామిని అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నా. డాక్టర్ కావాలని కలలు కన్న ఆ యువతి నర్స్‌గా ఎందుకు పనిచేయాల్సివచ్చింది. గుర్రం పాపిరెడ్డితో కలిసి ఓ దోపిడీలో సౌధామిని ఎందుకు భాగమైంది అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. కామెడీ నా ఫేవరేట్ జానర్. వరుసగా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల్లోనే అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నా. అలాగని కామెడీకే పరిమితం కాకుండా క్రైమ్, సీరియల్ కిల్లర్..వంటి డార్క్ మూవీస్ చేయాలని ఉంది.హీరోయిన్స్ అంటే అందంగా కనిపించాలని రూలేం లేదు. యాక్షన్ సినిమాలు కూడా చేయగలరని నిరూపించుకోవాలనుకుంటున్నా. జాతిరత్నాలు మూవీలో నేను చేసిన చిట్టి రోల్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. మళ్లీ అలాంటి మంచి రోల్ రాలేదనే రిగ్రేట్ ఇప్పటికీ ఉంది
కథలు రాస్తుంటా...
నాకు దర్శకత్వం అంటే ఇష్టం. ఎప్పటికైనా డైరెక్టర్‌గా సినిమా చేస్తా. ఇప్పటి నుంచే కథలు రాసుకుంటున్నా. సినిమా సెట్స్‌లో ఖాళీ టైమ్ దొరికితే కొత్త కాన్సెప్స్ట్ స్క్రిప్ట్స్, క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తుంటాను. ప్రస్తుతం మత్తువదలరా 2కు కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా రాబోతుంది. మత్తు వదలరా 3లో హీరోయిన్‌గా కనిపించబోతున్నా. భగవంతుడు మూవీలో ఓ ఇంటెన్స్ రోల్ చేస్తున్నా. అలాగే తమిళంలో సందీప్ కిషన్ తో సిగ్మా సినిమా చేస్తున్నా. దళపతి విజయ్ కొడుకు జాసన్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు గాయపడ్డ సింహం అనే ఒక మూవీలో సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్‌చేస్తున్నా
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



