త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sharwanand | కొత్త కారు కొన్న హీరో శ‌ర్వానంద్ – రేటు ఎంతో తెలుసా?

Sharwanand | టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ కొత్త కారు కొన్నారు. లెక్స‌స్ బ్రాండ్‌కు చెందిన ఈ ప్రీమియ‌ర్ కారు ధ‌ర మూడు కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం లెక్స్ బ్రాండ్ కారును టాలీవుడ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, నాగార్జున‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వాడుతున్నారు.

N

Entertainment | Published On Dec 11, 2025, 12.32 pm IST

Sharwanand | కొత్త కారు కొన్న హీరో శ‌ర్వానంద్ – రేటు ఎంతో తెలుసా?

శర్వానంద్

Advertisement

Sharwanand | నారీ నారీ న‌డుమ మురారితో ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు శ‌ర్వానంద్‌(Sharwanand). రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌కాబోతుంది. నారీ నారీ న‌డుమ మురారితో పాటు శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన మ‌రో సినిమా బైక‌ర్ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.ఈ రెండు సినిమాల ప్ర‌మోష‌న్స్‌తో శ‌ర్వానంద్ బిజీగా ఉన్నాడు.
తాజాగా శ‌ర్వానంద్ ఓ కొత్త కారు కొన్నాడు. లెక్స‌స్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియ‌ర్ కారు ధ‌ర మూడు కోట్లకుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. శ‌ర్వానంద్ కొత్త కారు కొన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
లెక్స‌స్ బ్రాండ్ కారును ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నాగార్జున‌, రామ్‌చ‌ర‌ణ్(Ram Charan), విజ‌య్ దేవ‌ర‌కొండ వాడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో శ‌ర్వానంద్ కూడా చేశారు.శ‌ర్వానంద్‌కు కార్లు అంటే ఇష్ట‌మ‌ట‌. ఇప్ప‌టికే అత‌డి గ్యారేజీలో బీఎమ్‌డ‌బ్ల్యూ, బెంజ్‌తో పాటు ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్‌కు చెందిన కార్లు ఉన్నాయి. తాజాగా లెక్స‌స్ కూడా కొనుగోలు చేశాడు.
గ‌త ఏడాది రిలీజైన మ‌న‌మే త‌ర్వాత శ‌ర్వానంద్ కొత్త సినిమా ఏది ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకుల‌తో పాటు ప్రొడ‌క్ష‌న్ స‌మ‌స్య‌ల కార‌ణంగా శ‌ర్వానంద్ సినిమాలు డిలే అవుతూ వ‌చ్చాయి.
శ‌ర్వానంద్ త‌న భార్య ర‌క్షిత రెడ్డికి విడాకులు ఇవ్వ‌బోతున్న‌ట్లు కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2023 ర‌క్షిత రెడ్డితో శ‌ర్వానంద్ పెళ్లి జ‌రిగింది. వీరికి 2024లో ఓ పాప పుట్టింది.మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా గ‌త కొన్నాళ్లుగా శ‌ర్వానంద్‌, ర‌క్షితా రెడ్డి విడివిడిగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. విడాకుల‌కు అప్ల‌య్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement