Rashmi Gautam | వారిని ఇరాన్ పంపించేయండి – వార్‌పై యాంకర్ రష్మి ట్వీట్ – ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఇరాన్ ఇజ్రాయెల్ వార్‌పై యాంకర్ రష్మ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. ఖమేనీ మృతికి నిరసనలు చేసిన వారందరిని ఇరాన్ పంపించాలంటూ మోదీని కోరుతూ ట్వీట్ చేసింది రష్మి. రాడికల్ మైండ్‌సెట్ ఉన్నవారి వల్లే దేశం మరింత వెనుకబాటుకు గురవుతుందని అన్నది.
Entertainment | Published On Mar 2, 2026, 5.09 pm IST
Rashmi Gautam | జబర్ధస్థ్ యాంకర్ రష్మి గౌతమ్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. పలు సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. ఆమె చేసిన పోస్ట్‌లు పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. ఎన్ని ట్రోల్స్ వచ్చినా రష్మిక ఏ రోజు వెనక్కి తగ్గలేదు. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ వారపై రష్మిక చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది. ఇరాన్ లీడర్ ఖమేనీ మృతిపై జమ్ముకశ్మీర్‌లో వందలాది ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తూ ర్యాలీలు చేపట్టారు. ఇరాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఇరాన్ పంపించేయండి...
ఈ ఫొటోను ఉద్దేశిస్తూ ఇలాంటి రాడికల్ మైండ్‌సెట్ ఉన్నవారిని ఇరాన్ పంపించేయండి అంటూ మోదీని కోరింది రష్మి. ఇరాన్ వెళ్లి వారంతా తమ సొంత ప్రజల కోసం పోరాడుతారంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నది. ఆమె ట్వీట్‌పై చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నాను. పెళ్లి చేసుకోకపోవడం వల్లే అన్ని మతాలను మీరు వ్యతిరేకిస్తున్నట్లుగా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అతడి ట్వీట్‌కు రష్మి బదులిచ్చింది.
పెళ్లి చేసుకోకుండా...
"అమ్మాయిలకు 9 ఏళ్లకే పెళ్లిళ్లు చేసే సంకుచిత భావాలు కలిగిన దేశంలో నేను బతకడం లేదు. పెళ్లి చేసుకోకుండా , పిల్లలు లేకుండా నాకంటూ సొంత గౌరవం, వ్యక్తిత్వంతో స్వేచ్ఛగా జీవించే దేశంలో ఉన్నందుకు గర్వపడుతున్నాను అంటూ బదులిచ్చింది. దేశంలో పేదరికం, కులాల గొడవలు, నిరక్షరాస్యత.. ఇలా ఎన్నో అంతర్గత సమస్యలు ఉన్నాయి. వీటన్నింటితో పాటు రాడికల్ మైండ్‌సెట్ ఉన్న ఇలాంటి వారి వల్ల దేశం మరింత వెనకబడిపోతుందని" రష్మి అన్నది. విప్లవ భావజాలం కలిగిన వారిని సమర్థించేది లేదంటూ చెప్పింది. యుద్ధం వద్దంటూ ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తోందని, గల్ఫ్ ప్రజలు తమ తమ నాయకుల చర్యలను ఖండిస్తున్నారంటూ రష్మి మరో ట్వీట్ లో పేర్కొన్నది. ఆమె చేసిన ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmi Gautam | నేను ఏ పార్టీకి, మతానికి వ్యతిరేకం కాదు..ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మి
మే 3, 2026

West Asia | ఏప్రిల్ 6 వరకు ఇరాన్‌కు డెడ్‌లైన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
మార్చి 27, 2026

Kashmir donations to Iran | నగదు నుంచి బంగారం వరకు.. యుద్ధంలో నష్టపోయిన ఇరాన్‌కు కశ్మీరీల భారీ విరాళాలు.. “థ్యాంక్యు ఇండియా” అన్న ఇరాన్!
మార్చి 23, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



