Rashmi Gautam | నేను ఏ పార్టీకి, మతానికి వ్యతిరేకం కాదు..ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మి
యాంకర్ రష్మి మరో వివాదంలో చిక్కుకుంది. వైకాపా కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రష్మిని ట్రోల్ చేస్తున్నారు. ఆమెపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. రష్మిని టార్గెట్ చేయడానికి కారణం ఏమిటంటే?
Entertainment | Published On May 3, 2026, 11.44 am IST
Rashmi Gautam | గత కొన్నాళ్లుగా యాంకర్ రష్మి పేరు చెబితే టీవీ షోస్, సినిమాల కంటే వివాదాలే ఎక్కువగా గుర్తొస్తున్నాయి. తన మనసులో ఉన్నది ఏదైనా నిర్భయంగా వెల్లడిస్తుంది రష్మి. మూగ జీవాల సంరక్షణతో పాటు ఇతర సామాజిక సమస్యల విషయంలో సోషల్ మీడియాలో పలుమార్లు రష్మి చేసిన ట్వీట్లు, పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. ఈ పోస్ట్‌ల ద్వారా ప్రశంసల కంటే రష్మిపై విమర్శలు, ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి.
బూతుల వర్షం...
తాజాగా మరోసారి యాంకర్ రష్మి వివాదంలో చిక్కుకుంది. వైసీసీ కార్యకర్తలు సోషల్ మీడియాలో రష్మిని తెగ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి ఈ యాంకర్‌పై బూతుల వర్షం కురిపిస్తున్నారు. వారి విమర్శలకు తనదైన స్టైల్‌లో రష్మి బదులిచ్చింది. ఈ ట్వీట్స్, పోస్ట్‌లు చర్చనీయాంశంగా మారాయి.
వివాదానికి కారణమేంటంటే?
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఇటీవల తిరుపతిలో వైకాపా నేత భూమ కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి నిరసన చేపట్టారు. ఓ ఎద్దుల బండిపై ఆటోను పెట్టడంతో పాటు అందులో కొందరు ఎక్కారు. వారి బరువు మోయలేక ఎద్దు ఇబ్బందిపడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజకీయ ప్రచారాల కోసం మూగ జీవాలను హింసించడం సరికాదంటూ ఈ వీడియోను ఉద్దేశించి రష్మి పోస్ట్ పెట్టింది. నిరసనలు తెలపడానికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉండగా....మూగ జీవాలను ఇబ్బంది పెట్టడం ఎందుకు...ఇలాంటి క్రూరత్వానికి ఒడిగట్టడం హేయమైన చర్య అంటూ రష్మి ట్వీట్ చేసింది. వాటిని బానిసలుగా మార్చే సంస్కృతిని ఇకనైనా ఆపితే మంచిదంటూ రష్మి తన పోస్ట్‌లో పేర్కొన్నది. ఎద్దు అనుభవించిన నరకాన్ని మీరు వెయ్యి రెట్లు అనుభవిస్తారు అంటూ శాపనర్ధాలు పెట్టింది.
ట్రోల్స్...
రష్మి చేసిన ట్వీట్‌ను కొందరు సమర్థిస్తుండగా...వైసీసీ కార్యకర్తలు మాత్రం ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమె సినిమాల గురించే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని జంతు హింస గురించే తాను మాట్లాడుతున్నానని రష్మి ఎంత చెప్పిన వినకుండా ఆమెపై బూతుల వర్షం కురిపించారు. నాన్ వెజ్ తింటూ నీతులు ఎందుకు మాట్లాడుతున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. తాను బ్రాహ్మిణ్ అని, నాన్ వెజ్ అస్సలు తిననని రష్మి బదులిచ్చింది. లెదర్ ప్రొడక్ట్స్ అస్సలు వాడనని అన్నది. మీకు ఓల్డ్ ఏజ్ హోమ్ పక్కా అని మరో నెటిజన్ కామెంట్ చేయగా...ఆత్మీయులనే కాదు..పెంపులు జంతువులను కూడా చివరి వరకు కంటికి రెప్పలా కాపాడే కుటుంబం మాది అంటూ బదులిచ్చింది రష్మి.
ఏ పార్టీకి వ్యతిరేకం కాదు...
తాను ఏ పార్టీకి, మతానికి వ్యతిరేకం కాదని రష్మి చెప్పింది. అవమానాలు కూడా తనకు కొత్త కాదని అన్నది. పండుగల టైమ్‌లో జంతు బలుల గురించి మాట్లాడినా నన్ను తిట్టారు. నాపై దేశ ద్రోహిగా ముద్రవేశారు. నేను జంతు సంరక్షణ గురించి మాట్లాడితే మరో అంశాన్ని ముందుకు తీసుకొచ్చి నన్ను విమర్శించడం అలవాటైపోయింది అంటూ రష్మి అన్నది. ఆడవాళ్ల రక్షణ గురించి మాట్లాడుతూ వారినే బూతులు తిడుతున్నారంటూ వాపోయింది. తనను చాలానే బూతు మాటలు అంటున్నారని వాపోయింది.
హోలీ మూవీతో...
రష్మి స్వస్థలం విశాఖపట్నం. తండ్రిది ఉత్తరప్రదేశ్, తల్లి ఒడియాకు చెందిన వారు కావడంతో తన కుటుంబంలో భిన్న సంస్కృతులు, ఆచారాలు కనిపిస్తుంటాయని పలుమార్లు చెప్పింది రష్మి. హోళీ మూవీ తో రష్మి యాక్టింగ్ కెరీర్ మొదలైంది. గణేష్, బిందాస్, ప్రస్తానంతో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది. గుంటూరు టాకీస్, అంతకుమించితో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. జబర్ధస్థ్ కామెడీతో షోతో యాంకర్‌గా రష్మి ఫేమస్ అయ్యింది.
First narrative marchadi
Boku munda
LANJA munda
Ne amma ne DENGA
NEE PUKU LO ACID VESTA (Meru aa vagaina neenche ostaru)
AADA VALA RAKSHANA GURUNCHI MATLADUTHU AADA VALIKI AADA BOTHULU CHEPTUNARU
FIRST ee marpu teskoni randi
Dana travatha meetha veshyalu matladkuntamu https://t.co/f5ZmOW6BAb— rashmi gautam (@rashmigautam27) May 2, 2026
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



