త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | త్రిష ఇంట్లో ఉంటే… విజ‌య్‌కి ప్ర‌జా స‌మ‌స్య‌లు ఎలా తెలుస్తాయి – త‌మిళ‌నాడు బీజేపీ ప్రెసిడెంట్ కామెంట్స్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై త‌మిళ‌నాడు బీజేపీ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్ర‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య్‌కి రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న రావాలంటే ముందు త్రిష ఇంట్లో నుంచి అత‌డు బ‌య‌ట‌కు రావాల‌ని నైనార్ నాగేంద్ర‌న్ అన్నారు. ఆయ‌న వ్యాఖ్య‌లు త‌మిళ‌నాట దుమారాన్ని రేపుతున్నాయి.

N

Entertainment | Published On Feb 14, 2026, 4.45 pm IST

Thalapathy Vijay | త్రిష ఇంట్లో ఉంటే… విజ‌య్‌కి ప్ర‌జా స‌మ‌స్య‌లు ఎలా తెలుస్తాయి – త‌మిళ‌నాడు బీజేపీ ప్రెసిడెంట్ కామెంట్స్‌
Advertisement

Thalapathy Vijay |  ఇటీవ‌లే సినిమాల‌కు గుడ్‌బై చెప్పాడు కోలీవుడ్ అగ్ర హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌. జ‌న‌నాయ‌గ‌న్ త‌న చివ‌రి సినిమా అంటూ ప్ర‌క‌టించాడు. సినిమాల‌కు వీడ్కోలు ప‌లికిన విజ‌య్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. టీవీకే (త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం ) పేరుతో ఓ పొలిటిక‌ల్ పార్టీని స్థాపించాడు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ పోటీ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టేశాడు. బ‌హిరంగ స‌భ‌లు, రోడ్ షోలు, మీటింగ్‌ల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.త‌మిళ‌నాట విజ‌య్ టీవీకేకు ల‌భిస్తోన్న ఆద‌ర‌ణ మిగిలిన పార్టీల‌కు షాకింగ్‌గా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది . విజ‌య్ రోడ్ షోలు, స‌భ‌ల‌కు భారీగా ప్ర‌జ‌లు హాజ‌రు అవుతున్నారు.

బీజేపీ ప్రెసిడెంట్‌...

పొలిటిక‌ల్‌గా విజ‌య్‌కి ల‌భిస్తోన్న‌ క్రేజ్‌పై త‌మిళ‌నాడు బీజేపీ ప్రెసిడెంట్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య్‌కి రాజ‌కీయాల‌పై ఎలాంటి అవ‌గాహ‌న లేద‌ని అన్నారు. "త‌మిళ‌నాడు వాస్త‌వ రాజ‌కీయ‌ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది గ్రౌండ్ లెవెల్‌లో విజ‌య్‌కి అర్థం కావాలంటే ముందు త్రిష ఇంట్లో నుంచి అత‌డు బ‌య‌ట‌కు రావాలి. హీరోయిన్‌తో ఉన్న బంధాన్ని తెంచుకొని త‌న కుటుంబంతో తిరిగి క‌లిసిపోయిన త‌ర్వాత రాజ‌కీయాల గురించి విజ‌య్ ఆలోచిస్తే మంచిది" అంటూ త‌మిళ‌నాడు బీజేపీ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్ర‌న్ కామెంట్స్ చేశాడు. విజ‌య్ అమాయ‌కుడు అంటూ పేర్కొన్నారు. ఆయ‌న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ఫ్యాన్స్ ఫైర్‌...

నైనార్ నాగేంద్ర‌న్‌పై విజ‌య్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. విజ‌య్‌ని ఎదుర్కోలేక అత‌డిపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని కామెంట్లు, ట్వీట్స్ పెడుతున్నారు. నైనార్ నాగేంద్రన్‌పై పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఐదు సినిమాలు...

కాగా విజ‌య్, త్రిష ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు త‌మిళ సినిమాలు వ‌చ్చాయి. గిల్లి, కురివి, లియోతో పాటు మిగిలిన సినిమాల్లో వీరి జోడీ బాగుందంటూ అభిమానుల నుంచి కామెంట్లు వ‌చ్చాయి. లియో మూవీ రిలీజ్ త‌ర్వాత త్రిష‌తో క‌లిసి విజ‌య్ ఓ ఫారిన్‌కు వెకేష‌న్‌కు వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్రేమ పుకార్ల‌పై విజ‌య్‌తో పాటు త్రిష ఇప్ప‌టివ‌ర‌కు రియాక్ట్ కాలేదు.

Advertisement
Advertisement