త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajasaab Song | రాజాసాబ్ సెకండ్ సింగిల్‌పై త‌మ‌న్ అప్‌డేట్ – ఈ సారి మెలోడీతో ట్రీట్‌

Rajasaab Song | రాజాసాబ్ (Raja Saab) సెకండ్ సింగిల్‌పై త‌మ‌న్ (Thaman) అదిరిపోయే అప్‌డేట్ అందించాడు. స‌హానా అనే మెలోడీ సాంగ్‌ను సెకండ్ సింగిల్‌గా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. డిసెంబ‌ర్ 12న ఈ సాంగ్ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Dec 9, 2025, 11.20 am IST

Rajasaab Song | రాజాసాబ్ సెకండ్ సింగిల్‌పై త‌మ‌న్ అప్‌డేట్ – ఈ సారి మెలోడీతో ట్రీట్‌

ప్రభాస్ రాజాసాబ్

Advertisement

Rajasaab Song |ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టించిన రాజాసాబ్ (Raja Saab) మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న‌ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. రిలీజ్‌కు మ‌రో నెల రోజులు మాత్ర‌మే టైమ్ ఉండ‌గా మేక‌ర్స్ మాత్రం ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌క‌పోవ‌డం అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతోంది. ప్ర‌మోష‌న్స్ స్పీడు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
రెబెల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ గుడ్‌న్యూస్ వినిపించాడు. రాజాసాబ్ సెకండ్ సింగిల్‌పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. స‌హానా స‌హానా అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను సెకండ్ సింగిల్‌గా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఈ పాట‌లో ప్ర‌భాస్‌తో పాటు నిధి అగ‌ర్వాల్ (Nidhhi Agerwal) క‌నిపిస్తార‌ని చెప్పారు. వీరి స్క్రీన్ ప్ర‌జెన్స్‌, స్టెప్పులు అదిరిపోతాయ‌ని త‌మ‌న్ అన్నాడు. త‌మ‌న్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. స‌హానా పాట‌కు కేకే సాహిత్యాన్ని అందించారు.
గ్రీస్‌లోని బ్యూటీఫుల్ లోకేష‌న్స్‌లో స‌హాన పాట‌ను షూట్ చేశారు. డిసెంబ‌ర్ 12న ఈ సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈ పాట విడుద‌ల‌కు సంబంధించిన అఫీషియ‌ల్‌ అనౌన్స్‌మెంట్ బుధ‌వారం రానున్న‌ట్లు స‌మాచారం.
రాజాసాబ్ ఫ‌స్ట్ సింగిల్ రెబెల్ సాబ్ అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు. త‌మ‌న్ ట్యూన్స్‌తో పాటు లిరిక్స్‌పై చాలా ట్రోల్స్ వ‌చ్చాయి. ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో సెకండ్ సింగిల్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు స‌మాచారం.
హార‌ర్ కామెడీగా తెర‌కెక్కుతున్న రాజాసాబ్‌కు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌భాస్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్‌తో పాటు రిద్దికుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ రెండు డిఫ‌రెంట్స్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు.
దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ రాజాసాబ్ సినిమాను నిర్మించారు. ప్ర‌భాస్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను జియో హాట్‌స్టార్ దాదాపు 140 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఓటీటీ డీల్‌పై మంగ‌ళ‌వారం చెన్నైలో జ‌రిగినే ఈవెంట్ ద్వారా మేక‌ర్స్ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ నెలాఖ‌రు నుంచి రాజాసాబ్ ప్ర‌మోష‌న్స్‌లో ప్ర‌భాస్ పాల్గొనున్న‌ట్లు చెబుతున్నారు.
కాగా ఈ సంక్రాంతికి రాజాసాబ్‌తో పాటు మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి, అన‌న‌గ‌నా ఒక రాజుతో పాటు నారి నారి న‌డుమ మురారి రిలీజ్ కాబోతున్నాయి. మ‌రో రెండు త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు రేసులో ఉన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement