Vijay – Trisha | దళపతి విజయ్, త్రిష బ్లాక్‌బస్టర్ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ – మహేష్‌బాబు సినిమాకు రీమేక్
దళపతి విజయ్, త్రిష బ్లాక్‌బస్టర్ మూవీ గిల్లీ మరోసారి థియేటర్లలోకి రాబోతుంది. ఫిబ్రవరి 20న రీ రిలీజ్ అవుతోంది. మహేష్‌బాబు ఒక్కడు మూవీకి రీమేక్‌గా రూపొందిన గిల్లీతోనే ఫస్ట్ టైమ్ విజయ్, త్రిష జోడీకట్టారు.
Entertainment | Published On Feb 16, 2026, 5.36 pm IST
Vijay - Trisha | కోలీవుడ్‌లో గత కొద్ది రోజులుగా దళపతి విజయ్, త్రిష పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్, త్రిష బంధంపై బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ ఇటీవల చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ పొలిటికల్ లీడర్ కామెంట్లపై తన లాయర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది త్రిష. బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులతో పాటు సామాన్యుల నుంచి వ్యతిరేకత రావడంతో నైనార్ నాగేంద్రన్ వెనక్కి తగ్గారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు.
గిల్లీ రీ రిలీజ్...
ఈ వివాదం నేపథ్యంలో దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన తమిళ మూవీ గిల్లీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 20న మరోసారి ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. సోమవారం గిల్లీ రీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
ఫస్ట్ మూవీ...
విజయ్, త్రిష కలయికలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. మహేష్‌బాబు హీరోగా నటించిన తెలుగు మూవీ ఒక్కడుకు రీమేక్‌గా గిల్లీ రూపొందింది. తెలుగు ఒరిజినల్ కంటే గిల్లీ ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టింది. గిల్లీ బ్లాక్‌బస్టర్‌కు విజయ్, త్రిష కెమిస్ట్రీ కూడా ఓ కారణంగా నిలిచింది. అప్పడి పోడు అనే పాట అప్పట్లో సెన్సేషనల్‌గా నిలిచింది.
గిల్లీ రీ రిలీజ్ కావడం ఇది రెండో సారి. 2024లో గిల్లీ సినిమాను 4కేలోకి మార్చి థియేటర్లలోకి తీసుకొచ్చారు. దాదాపు 30 కోట్లకుపైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రీ రిలీజ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రెండోసారి కూడా ఈ సినిమా భారీగానే వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
జననాయగన్ వాయిదా...
దళపతి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాపడింది. జననాయగన్ ఫిబ్రవరి 20న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ సెన్సార్ సమస్యలు క్లియర్ కాకపోవడంతో ఏప్రిల్ 30కి ఈ సినిమా వెళ్లిపోయినట్లు చెబుతోన్నారు. విజయ్ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఫిబ్రవరి 20న జననాయగన్ స్థానంలో గిల్లీని రిలీజ్ చేస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
గిల్లీతో విజయ్, త్రిష కాంబినేషన్‌లో మొత్తం ఐదు తమిళ సినిమాలు వచ్చాయి. తిరుపాచి, కురివి, లియో, ఆథి సినిమాలతో విజయ్, త్రిష జోడీ అభిమానులను ఆకట్టుకున్నారు. విజయ్ ది గోట్‌లో త్రిష గెస్ట్ రోల్‌లో కనిపించింది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



