త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ క‌ష్టాల‌కు పుల్‌స్టాప్ – నెగ్గిన సెన్సార్ బోర్డు పంతం – పొలిటిక‌ల్ డైలాగ్స్‌కు క‌త్తెర‌

ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ అడ్డంకులు తొల‌గిపోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సెన్సార్ వివాదానికి సంబంధించిన హైకోర్టులో వేసిన పిటిష‌న్‌ను మేక‌ర్స్ ఉప‌సంహ‌రించుకోనున్నార‌ట‌. సినిమాను ఇర‌వై నిమిషాల పాటు ట్రిమ్ చేయ‌డానికి అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Feb 9, 2026, 7.42 pm IST

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ క‌ష్టాల‌కు పుల్‌స్టాప్ – నెగ్గిన సెన్సార్ బోర్డు పంతం – పొలిటిక‌ల్ డైలాగ్స్‌కు క‌త్తెర‌
Advertisement

Jana Nayagan |  ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ క‌ష్టాల‌కు పుల్‌స్టాప్ ప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. సెన్సార్ అడ్డంకులు నుంచి త్వ‌ర‌లోనే ఈ త‌మిళ మూవీ బ‌య‌ట‌ప‌డునున్న‌ట్లు చెబుతోన్నారు. హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన జ‌న‌నాయ‌గ‌న్‌ను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమాలోని పొలిటిక‌ల్ డైలాగ్స్‌తో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాల‌పై సెన్సార్‌ బోర్డు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి నిరాక‌రించింది.

సుప్రీంకోర్టు వ‌ర‌కు...

సెన్సార్ తీరుపై అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ మేక‌ర్స్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ సినిమాకు యూఏ స‌ర్టిఫికెట్ ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై సెన్సార్ బోర్డ్ డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించింది. డివిజ‌న్ బెంచ్ రిలీజ్‌పై స్టేను విధించింది. ఈ స్టేపై నిర్మాత‌లు సుప్రీంకోర్టును వెళ్లారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ వివాదంలో జోక్యం చేసుకోలేమ‌ని చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోమ‌ని అన్న‌ది.
హైకోర్టు...సుప్రీంకోర్టు అంటూ గ‌త నెల రోజులుగా సెన్సార్ వివాదం కోర్టులో నానుతూనే ఉంది. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాలేదు.

మేక‌ర్స్ రాజీ....

ఇన్నాళ్లు సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు, చేర్పుల‌పై త‌గ్గేదేలే అన్న మేక‌ర్స్ తాజాగా రాజీప‌డిన‌ట్లు స‌మాచారం. సెన్సార్ వివాదానికి సంబంధించి మ‌ద్రాస్ హైకోర్టులో వేసిన పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. సెన్సార్ బోర్డు సూచ‌న‌ల‌కు అనుగుణంగానే జ‌న‌నాయ‌గ‌న్‌ను విడుద‌ల చేయాల‌ని ఫిక్సైయ్యార‌ట‌. ఈ సినిమాను రివైంజింగ్ క‌మిటీకి పంప‌నున్నార‌ట‌. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సూచించిన‌ట్లుగా సినిమాను ఇర‌వై నిమిషాల‌కుపైగా ట్రిమ్ చేయ‌డానికి కూడా ఒప్పుకున్న‌ట్లు తెలిసింది. పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌ను విమ‌ర్శిస్తూ జ‌న‌నాయ‌గ‌న్‌లో ఉన్న‌ డైలాగ్స్ అన్నింటికి క‌త్తెర‌ప‌డ‌నుంద‌ని అంటున్నారు. కొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్నిక‌లు కార‌ణ‌మా...

స‌డెన్‌గా మేక‌ర్స్ పిటిష‌న్ ఉప‌సంహ‌రించుకోవ‌డానికి త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఈ నెలాఖ‌రున త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ జారీ కానుంది. జ‌న‌నాయ‌గ‌న్ పొలిటిక‌ల్ మూవీ కావ‌డం, విజ‌య్ పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతుండ‌టంతో ఎలెక్ష‌న్స్ కోడ్ కార‌ణంగా సినిమా రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌లు పూర్తయి రిజ‌ల్ట్ వ‌చ్చిన త‌ర్వాత అంటే మే వ‌ర‌కు సినిమా రిలీజ్ కోసం ఆగాల్సివ‌స్తుంది. అప్ప‌టిలోగా సినిమాపై ఉన్న బ‌జ్ పూర్తిగా పోతుంది. అందుకే మేక‌ర్స్ సెన్సార్ బోర్డ్‌తో రాజీ ప‌డ్డ‌ట్లు చెబుతోన్నారు.

పూజా హెగ్డే...

మ‌రో రెండు మూడు రోజుల్లో రివైంజింగ్ క‌మిటీ నుంచి క్లియ‌రెన్స్ రానుంది. సెన్సార్ బోర్డ్‌ కూడా స‌ర్టిఫికెట్ ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 19 లేదా 20న జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తున్న చివ‌రి మూవీ ఇది. ఈ సినిమా త‌ర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు విజ‌య్ ఇటీవ‌లే అధికారికంగా ప్ర‌క‌టించారు. జ‌న‌నాయ‌గ‌న్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌మితా బైజు కీల‌క పాత్ర పోషిస్తోంది. బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement