త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG High Court | మ‌న శంక‌ర్ వ‌ర‌ప్ర‌సాద్ గారు, రాజాసాబ్‌కు హైకోర్టులో ఊర‌ట‌..! టికెట్ల ధ‌ర‌ల పెంచుకునేందుకు అనుమ‌తి..!

P

Entertainment | Published On Jan 7, 2026, 5.43 pm IST

TG High Court | మ‌న శంక‌ర్ వ‌ర‌ప్ర‌సాద్ గారు, రాజాసాబ్‌కు హైకోర్టులో ఊర‌ట‌..! టికెట్ల ధ‌ర‌ల పెంచుకునేందుకు అనుమ‌తి..!
Advertisement

TG High Court | మ‌న శంక‌రవ‌రప్ర‌సాద్ గారు, ది రాజాసాభ్ చిత్ర నిర్మాత‌ల‌కు తెలంగాణ హైకోర్టు ఊర‌ట‌నిచ్చింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు కేవ‌లం ‘పుష్ప2’, ‘ఓజీ’, ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘అఖండ 2’ చిత్రాలకే పరిమితం చేసింది. దాంతో తాజా చిత్రాల నిర్మాతలకు ఊరట లభించినట్లయ్యింది. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ‘రాజాసాబ్‌’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్ర నిర్మాతలు స‌వాల్ హైకోర్టులో స‌వాల్ చేశారు. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్లు వేశారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. ఆయా పిటిష‌న్ల‌పై విచార‌ణ బుధ‌వారం విచార‌ణ జ‌రిపిన కోర్టు.. గతంలో ఇచ్చిన తీర్పును ఆ చిత్రాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ రెండు చిత్రాలకు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం లభించింది. దాంతో ఆయా చిత్రాల నిర్మాతలకు ఊరట లభించినట్లయ్యింది. నిర్మాత‌లు టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునే వీలు క‌లిగింది. హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో ‘ది రాజాసాబ్‌’ బుకింగ్స్‌ ఓపెన్ అయ్యే అవ‌కాశం ఉంది. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ‘ది రాజాసాబ్‌’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ది. ఈ మూవీకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మాళ‌విక మోహ‌న‌న్‌, రిద్ది కుమార్‌, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. న‌య‌న‌తార ఈ మూవీలో హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ది.

ఇదిలా ఉండ‌గా.. రాజాసాబ్ మూవీ ప్రీమియ‌ర్ షోస్ సింగిల్ స్క్రీన్స్‌లో రూ.900, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.1000 వ‌ర‌కు ధ‌ర‌లు ఉండేలా త‌మ నిర్మాత‌లు ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు స‌మాచారం. జీఎస్టీతో క‌లిపి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.944, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.1180 వ‌ర‌కు ధ‌ర‌లు ఉండే అవ‌కాశం ఉంది. జ‌న‌వ‌రి 8న ప్రీమియ‌ర్‌తో పాటు 9న ఉద‌యం 6 గంట‌ల స్పెష‌ల్‌కు ప్ర‌ద‌ర్శించేందుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని రాజాసాబ్ మేక‌ర్స్ కోరారు. టికెట్ ధ‌ర‌ల‌ను జ‌న‌వ‌రి 9 నుంచి 18 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో 105, మ‌ల్టీప్లెక్స్‌లో 132 రూపాయ‌లు పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ మేక‌ర్స్ 11న ప్రీమియ‌ర్ షోకు రూ.600 టికెట్ ధ‌ర‌లు ఉండేలా చూడ‌మ‌ని రిక్వెస్ట్ చేసిన‌ట్లు తెలిసింది. జ‌న‌వ‌రి 11 నుంచి 18 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మ‌ల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేలా అనుమ‌తి కోరిన‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement