త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prithvi Shaw | టాలీవుడ్ హీరోయిన్‌తో టీమిండియా క్రికెట‌ర్ పృథ్వీషా ఎంగేజ్‌మెంట్ – ఫొటోలు వైర‌ల్‌

టీమిండియా క్రికెట‌ర్ పృథ్వీషా పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నాడు. ప్రియురాలు అకృతి అగ‌ర్వాల్‌తో పృథ్వీషా ఎంగేజ్‌మెంట్ ఆదివారం జ‌రిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుఉన్నాడు.

N

Entertainment | Published On Mar 8, 2026, 7.20 pm IST

Prithvi Shaw | టాలీవుడ్ హీరోయిన్‌తో టీమిండియా క్రికెట‌ర్ పృథ్వీషా ఎంగేజ్‌మెంట్ – ఫొటోలు వైర‌ల్‌
Advertisement

Prithvi Shaw | టీమిండియా క్రికెట‌ర్ పృథ్వీషా లైఫ్‌లో కొత్త ఇన్నింగ్స్ మొద‌లైంది. ఆదివారం అభిమానుల‌కు గుడ్‌న్యూస్ వినిపించాడు. ప్రియురాలు ఆకృతి అగ‌ర్వాల్‌తో ఆదివారం పృథ్వీషా ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. "మైదానంలో సిక్సర్లు మాత్ర‌మే కాదు....నా జీవితంలో స‌క్సెస్‌ తనతోనే మొదలైంది. తనే నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్" అంటూ ఫొటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ ఫొటోల్లో పృథ్వీషా,  ఆకృతి అగ‌ర్వాల్ ట్రెడిష‌న‌ల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. పృథ్వీషా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌...

సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ అయిన ఆకృతి అగ‌ర్వాల్ ల‌క్నోలో పుట్టింది.  వీరి కుటుంబం ముంబైలో స్థిర‌ప‌డింది. బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ మెనేజ్‌మెంట్ స్ట‌డీస్‌లో గ్రాడ్యూయేష‌న్ కంప్లీట్ చేసింది ఆకృతి అగ‌ర్వాల్ . ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకృతికి మూడు మిలియ‌న్ల‌కుపైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ...

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో రిలీజైన తెలుగు మూవీ త్రిముఖ‌లో హీరోయిన్‌గా న‌టించింది ఆకృతి అగ‌ర్వాల్‌. రాజేష్ దండా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో స‌న్నీలియోన్‌, యోగేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హీరోయిన్‌గా ఇదే ఆకృతి అగ‌ర్వాల్‌కు డెబ్యూ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది కాలంగా ఆకృతి అగ‌ర్వాల్‌తో పృథ్వీషా ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చెబుతోన్నారు.

అన్‌సోల్డ్ ప్లేయ‌ర్‌...

దేశ‌వాళీతో పాటు అండ‌ర్ 19 క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన పృథ్వీషా ఆ త‌ర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచ‌రీ సాధించి స‌త్తా చాటాడు. స‌చిన్ వార‌సుడు అంటూ మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు క్రికెట్ లవర్స్ అతడిపై ప్ర‌శంస‌లు కురిపించారు. కానీ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో పాటు ఫామ్ కోల్పోవ‌డంతో కొద్ది రోజుల్లోనే టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా 2025 వేలంలో అన్‌సోల్డ్ ప్లేయ‌ర్‌గా మిగిలిపోయాడు. గ‌త ఏడాది డొమెస్టిక్ క్రికెట్‌లో క్రికెట్‌లో రాణించిన పృథ్వీషా  ను ఐపీఎల్ 2026 వేలంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 75 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.టీమిండియా తరఫున ఐదు టెస్ట్‌లు, ఆరు వ‌న్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. చివ‌ర‌గా టీమిండియా త‌ర‌ఫున 2021లో శ్రీలంక‌తో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ త‌ర్వాత జ‌ట్టులో స్థానంలో కోల్పోయాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.

Advertisement
Advertisement