Tara Sutaria | వీర్ పహారియాతో బ్రేకప్ వార్తలు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తారా సుతారియా..!
Entertainment | Published On Feb 8, 2026, 1.30 pm IST
Tara Sutaria | బాలీవుడ్ నటి తారా సుతారియా సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. వీర్ పహారియాతో పీకల్లోతు లవ్‌లో ఉండగా.. బ్రేకప్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై క్లారిటీ లేకపోయినా తాను మాత్రం మానసిక ప్రశాంతతకే ప్రాధాన్యం ఇస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఎల్లే ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారా తన గోల్ గురించి వివరించింది. ‘నిజమైన విజయం అంటే మనశ్శాంతిగా ఉండడమేనని నేను నమ్ముతాను. నన్ను నిజంగా ప్రేమించే, నన్ను అర్థం చేసుకునే కొద్దిమంది నా జీవితంలో ఉంటే చాలు. అదే నా జీవిత ఉద్దేశ్యం’ చెప్పింది. కెరీర్ ముందుకు వెళ్లేకొద్దీ మనశ్శాంతిని కాపాడుకోవడం ఇంకా ముఖ్యమని పేర్కొంది. తనకు ఏమి కావాలో అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని తారా చెప్పుకొచ్చింది. ‘నా మనసుకు శాంతిని ఇవ్వగలిగే విషయాలను నేర్చుకున్నాను. మన నర్వస్ సిస్టమ్‌ను ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో మనకే తెలుసు’ అని పేర్కొంది.
ఇటీవల తారా సుతారియా, వీర్ పహారియా విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఎవరూ మాత్రం స్పందించలేదు. ఏపీ ధిల్లాన్ ముంబయి కాన్సర్ట్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. ఆ వీడియోను తారా ‘పెయిడ్ పీఆర్’ అంటూ విమర్శించింది. మరోవైపు, వైరల్ అవుతున్న క్లిప్ ఎడిట్ చేసిందని వీర్ పహారియా పేర్కొన్నాడు. ఆ తర్వాత ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో ఏపీ ధిల్లాన్‌ను వీర్ పహాడియా, తారా సుతారియా ప్రోత్సహిస్తూ కనిపించారు. ఆ వీడియోను మళ్లీ షేర్ చేసిన వీర్ ‘నిజం ఎప్పుడూ గెలుస్తుంది’ అంటూ కామెంట్ చేశారు. అయితే, వాస్తవానికి వీర్, తారా సుతారియా ఇద్దరు గత కొన్నేళ్లుగా లవ్‌లో ఉన్నారు. ఇద్దరు గతేడాది జులైలో తమ రిలేషన్‌ను బయటపెట్టారు. ఇదిలా ఉండగా.. తారా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘టాక్సిక్’లో కీలక పాత్రలో నటించనున్నది. ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






