త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీకి తొల‌గిన అడ్డంకులు – రిలీజ్ మ‌రింత ఆల‌స్యం

కార్తీక్ ఆర్య‌న్ హీరోగా అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తూ మేరీ జింద‌గీ హై సినిమాతో శ్రీలీల బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్ట‌బోతుంది. ఏప్రిల్ 30న ఈ రొమాంటిక్ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు నిర్మాణ సంస్థ టీ సిరీస్ ప్ర‌క‌టించింది.

N

Entertainment | Published On Oct 15, 2026, 5.46 pm IST

Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీకి తొల‌గిన అడ్డంకులు – రిలీజ్ మ‌రింత ఆల‌స్యం
Advertisement

Sreeleela |శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీకి అడ్డంకులు తొల‌గిపోయాయి. ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ గురువారం అఫీషియ‌ల్‌గా రివీల్ చేశారు. కార్తీక్ ఆర్య‌న్ హీరోగా అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో ఓ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ గ‌త ఏడాది మొద‌లైంది. ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ ల‌వ్‌స్టోరీతోనే శ్రీలీల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఉస్తాద్ కంటే ముందు...

ఉస్తాద్‌ భ‌గ‌త్‌సింగ్ కంటే ముందు శ్రీలీల ఈ బాలీవుడ్ సినిమాను అంగీక‌రించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా రిలీజై ఆరు నెల‌లు దాటిపోయింది. కానీ అనురాగ్ బ‌సు సినిమా షూటింగ్ మాత్రం ఏడాది నుంచి సాగు...తూనే ఉంది. తొలుత ఈ మూవీకి ఆషికీ 3 అనే టైటిల్ అనుకున్నారు. వివాదం కార‌ణంగా పేరును తూ మేరీ జింద‌గీ హైగా మార్చేశారు. నిర్మాత‌ల‌తో ద‌ర్శ‌కుడికి ఏర్ప‌డిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఈ రొమాంటిక్ మూవీ ఆగిపోయిన‌ట్లు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లొస్తున్నాయి. షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రాక‌పోవ‌డం, శ్రీలీల కూడా సెలైంట్‌గా ఉండ‌టంతో ఈ రూమ‌ర్ల‌ను నిజ‌మేన‌ని అంతా ఫిక్స‌య్యారు.

పుల్‌స్టాప్...

ఎట్ట‌కేల‌కు మేక‌ర్స్ ఈ పుకార్ల‌ను పుల్‌స్టాప్ పెట్టారు. తూ మేరీ జింద‌గీ హై రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తూ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 30న ఈ సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. షూటింగ్‌తో పాటు పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ డిలే వ‌ల్లే విడుద‌ల తేదీ వ‌చ్చే ఏడాదికి వాయిదాప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ల‌వ్ ఫెయిల్యూర్స్...

తూ మేరీ జింద‌గీ హైలో శ్రీలీల‌, కార్తిక్ ఆర్య‌న్ ఇద్ద‌రూ ల‌వ్ ఫెయిల్యూర్స్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అనుకోకుండా ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ఎలాంటి మ‌లుపుతు తిరిగింద‌నే అంశాల‌తో మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా డైరెక్ట‌ర్ అనురాగ్ బ‌సు ఈ సినిమాను రూపొందిస్తోన్నారు. ప్రీత‌మ్ చ‌క్ర‌వ‌ర్తి సంగీతం అందిస్తోన్నారు.
అనురాగ్ బ‌సు మూవీతో పాటు హిందీలో జాన్వీక‌పూర్‌తో రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీని అంగీక‌రించింది . శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై ఎట్ట‌కేల‌కు స‌స్పెన్స్ వీడింది. రొమాంటిక్ మూవీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా ఖ‌రారైంది.

Advertisement
Advertisement