Tamil OTT | ఒకే రోజు ఐదు ఓటీటీలలో రిలీజ్ కానున్న తమిళ అంథాలజీ మూవీ – టూ మచ్ బోల్డ్
తమిళ అంథాలజీ మూవీ హాట్ స్పాట్ టూ మచ్ ఒకే రోజు ఐదు ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఏ ఓటీటీలలో, ఏ రోజు రిలీజ్ కానుందంటే?
Entertainment | Published On Feb 15, 2026, 4.52 pm IST
Tamil OTT | లేటెస్ట్ కోలీవుడ్ అంథాలజీ మూవీ హాట్ స్పాట్ టూ మచ్ ఒకే రోజు ఐదు ఓటీటీలలో రిలీజ్ కాబోతుంది. మూడు ఉప కథలతో తెరకెక్కిన ఈ అంథాలజీ మూవీలో ప్రియా భవానీ శంకర్, తంబి రామయ్య, ఎమ్ఎస్ భాస్కర్, భవానీ శ్రీ, బ్రిగడ సాగా కీలక పాత్రల్లో నటించారు. ఈ తమిళ సినిమాకు విఘ్నేష్ కార్తిక్ దర్శకత్వం వహించాడు. హాట్ స్పాట్ టూ మచ్ సినిమాకు కోలీవుడ్ హీరో విష్ణువిశాల్ ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
సీక్వెల్....
2024లో వచ్చిన హాట్‌స్పాట్ మూవీకి సీక్వెల్‌గా హాట్ స్పాట్ టూ మచ్ మూవీ తెరకెక్కింది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ అంథాలజీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 20న ఒకే రోజు ఐదు ఓటీటీలలో రిలీజ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, లయన్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్‌తో పాటు షార్ట్ ఫిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతంది. ఐదు ఓటీటీ సంస్థలు అఫీషియల్‌గా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించాయి.
బోల్డ్ కాన్సెప్ట్‌తో...
టైమ్ ట్రావెల్‌తో పాటు ఫ్యాన్స్ వార్,అమ్మాయిల దుస్తులపై సమాజంలోని అభ్యంతరాలతో మూడు కథల సమాహారంగా బోల్డ్ కాన్సెప్ట్‌తో హాట్ స్పాట్ టూ మచ్ మూవీ రూపొందింది. ఈ కథలను పరిచయం చేసే పాత్రలో ప్రియా భవానీ శంకర్ కనిపించింది.
ఫ్యాన్స్ వార్...
ఎమ్ఎస్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటించిన కథలో అభిమానం పేరుతో స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎలా హద్దులు దాటుతుంటారన్నది దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ చూపించారు. తంబిరామయ్య స్టోరీలో...దుస్తుల విషయంలో నేటి కాలానికి చెందిన ఓ కూతురికి, పాతతరం భావాలు కలిగిన తండ్రికి నెలకొన్న సంఘర్షణను హృద్యంగా ఆవిష్కరించారు. చాలా బోల్డ్‌గా ఈ కథను చర్చించారు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం టైమ్ మిషన్‌లో 2050కి వెళతాడు ఓ యువకుడు. అతడికి ఆ అమ్మాయి కనిపించిందా? తన ప్రేమను ఆమెకు వ్యక్తం చేశాడా అనే కథతో మూడో స్టోరీ రూపొందింది. మూడు కథలను కేవలం రెండు గంటల నిడివితోనే చెప్పారు డైరెక్టర్.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






