త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | ఒకే సారి రెండు బ‌యోపిక్‌ల‌కు మిల్కీ బ్యూటీ గ్రీన్‌సిగ్న‌ల్‌

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం రెండు బ‌యోపిక్ సినిమాలు చేస్తోంది. లెజెండ‌రీ ఫిల్మ్ మేక‌ర్ శాంతారాం బ‌యోపిక్‌లో అల‌నాటి హీరోయిన్ జ‌య‌శ్రీగా త‌మ‌న్నా క‌నిపించ‌బోతున్న‌ది. అలాగే ముంబై మాజీ పోలీస్ క‌మీష‌న‌ర్ రాకేష్ మారియా జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Entertainment | Published On Mar 29, 2026, 4.07 pm IST

Tamannaah | ఒకే సారి రెండు బ‌యోపిక్‌ల‌కు మిల్కీ బ్యూటీ గ్రీన్‌సిగ్న‌ల్‌
Advertisement

Tamannaah |  గ‌త కొద్ది కాలంగా సీనియ‌ర్ హీరోయిన్ల జోరు త‌గ్గింది. అనుష్క‌, స‌మంత‌, కాజ‌ల్‌తో పాటు చాలా మంది హీరోయిన్లు అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు, మూడేళ్ల‌కో సినిమా చేస్తున్నారు. కానీ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మాత్రం ఇప్ప‌టికీ యంగ్ హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది. బాలీవుడ్‌, టాలీవుడ్ రెండు ఇండ‌స్ట్రీల‌ను క‌వ‌ర్ చేస్తోంది. క‌థానాయిక‌గానే కాకుండా స్పెష‌ల్ సాంగ్స్‌తో అద‌ర‌గొడుతోంది. ప్ర‌స్తుతం ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది త‌మ‌న్నా. ప్ర‌స్తుతం రెండు బ‌యోపిక్ సినిమాల్లో న‌టిస్తోంది.

వీ శాంతారాం బ‌యోపిక్‌...

లెజెండ‌రీ ఫిల్మ్ మేక‌ర్ శాంతారాం జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. వీ శాంతారాం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇందులో అల‌నాటి హీరోయిన్ జ‌య‌శ్రీ పాత్ర‌లో త‌మ‌న్నా క‌నిపించ‌బోతున్న‌ది. శాంతారాం సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన జ‌య‌శ్రీ ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడితో ఎలా ప్రేమ‌లో ప‌డింది? అప్ప‌టికే పెళ్లైనా శాంతారాం జీవితంలోకి రెండో భార్య‌గా ఎలా అడుగుపెట్టింద‌నే అంశాల‌తో త‌మ‌న్నా పాత్ర సాగ‌నుంద‌ట‌. ఈ సినిమాలో శాంతారాం పాత్ర‌లో సిద్ధాంత్ ఛ‌తుర్వేది క‌నిపించ‌బోతున్నాడు. అభిజీత్ దేశ్‌పాండే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. న‌వంబ‌ర్ 18న ఈ బ‌యోపిక్ మూవీ రిలీజ్ కాబోతుంది.

రాకేష్ మారియా బ‌యోపిక్‌...

ముంబై మాజీ పోలీస్ క‌మీష‌న‌ర్ రాకేష్ మారియా బ‌యోపిక్ మూవీ వెండితెర‌పైకి రాబోతుంది. మారియా ఐపీఎస్ పేరుతో స్టార్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఈ సినిమాలో రాకేష్ మారియా పాత్ర‌లో జాన్ అబ్ర‌హ‌మ్ క‌నిపించ‌నుండ‌గా...ఆయ‌న భార్య ప్రీతీ మారియాగా త‌మ‌న్నా న‌టిస్తోంది. పాట‌లు లేకుండా ఔట్ అండ్ ఔట్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. 1993 ముంబై బాంబు పేలుళ్ల‌తో పాటు 26 11 ఎటాక్స్ లాంటి సంఘ‌ట‌న‌ల‌ను మారియా ఐపీఎస్ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది ద‌శ‌కు చేరుకుంద‌ట‌. ఆగ‌స్ట్‌లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.
ఈ రెండు సినిమాల‌తో పాటు వాన్‌, రాగిణి ఎంఎంఎస్ 3, రేంజ‌ర్‌తో పాటు త‌మిళంలో పురుష‌న్ సినిమాలు చేస్తోంది త‌మ‌న్నా.

Advertisement

తాజావార్తలు

Advertisement