త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Film Chamber | ఫిల్మ్ ఛాంబ‌ర్ ఎన్నిక‌ల్లో దిల్ రాజు ప్యాన‌ల్ ఘ‌న విజ‌యం – నూతన అధ్య‌క్షుడిగా సురేష్‌బాబు

ఫిల్మ్ ఛాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిగా సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ సురేష్‌బాబు ఎన్నిక‌య్యారు. ఆదివారం జ‌రిగిన ఫిల్మ్ ఛాంబ‌ర్ ఎన్నిక‌ల్లో దిల్‌రాజు, అల్లు అర‌వింద్ బ‌ల‌ప‌ర‌చిన ప్రొగ్రెసివ్ ప్యాన‌ల్ విజ‌యం సాధించింది.

N

Entertainment | Published On Dec 28, 2025, 9.20 pm IST

Film Chamber | ఫిల్మ్ ఛాంబ‌ర్ ఎన్నిక‌ల్లో దిల్ రాజు ప్యాన‌ల్ ఘ‌న విజ‌యం – నూతన అధ్య‌క్షుడిగా సురేష్‌బాబు
Advertisement

Film Chamber | తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిగా ప్ర‌ముఖ నిర్మాత సురేష్‌బాబు ఎన్నిక‌య్యారు. ఉపాధ్య‌క్షులుగా సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, భ‌ర‌త్ చౌద‌రి, పి కిర‌ణ్‌ నియ‌మితుల‌య్యారు. ఫిల్మ్ ఛాంబ‌ర్ ఎన్నిక‌లు ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్రొగ్రెసివ్ ప్యాన‌ల్‌తో పాటు మ‌న ప్యాన‌ల్ పోటీ ప‌డ్డాయి. ప్రొగ్రెసివ్ ప్యాన‌ల్‌కు దిల్‌రాజు, అల్లు అర‌వింద్‌, సురేష్‌బాబు లాంటి టాప్ ప్రొడ్యూస‌ర్లు మ‌ద్ద‌తు ఇవ్వ‌గా ...మ‌న ప్యాన‌ల్‌ను సి క‌ళ్యాణ్‌, చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు, తుమ్మ‌ల‌ప‌ల్లి ప్ర‌స‌న్న‌కుమార్ బ‌ల‌ప‌రిచారు. ఆదివారం ఉద‌యం ప్రారంభ‌మైన పోలింగ్ మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు సాగింది. ఫిలిం ఛాంబ‌ర్‌లో 3355 మంది స‌భ్యులు ఉండ‌గా 1421 ఓట్లు పోల‌య్యాయి.
ఈ ఎన్నిక‌ల్లో నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, స్టూడియోతో పాటు అన్నింటికి క‌లిసి 48 కార్య‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో ప్రొగ్రెసివ్ ప్యాన‌ల్ నుంచి 31 మంది విజ‌యం సాధించ‌గా...మ‌న ప్యాన‌ల్ నుంచి 17 మంది మాత్ర‌మే గెలిపారు.
నిర్మాత‌ల సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యాన‌ల్ నుంచి ఐదుగురు, మ‌న ప్యాన‌ల్ నుంచి ఏడుగురు విజ‌యం సాధించారు. ఎగ్జిబిట‌ర్ సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యాన‌ల్ నుంచి 12 మంది విజ‌యం సాధించ‌గా...మన ప్యాన‌ల్ నుంచి ఇద్ద‌రే గెలిపారు. డిస్ట్రిబ్యూష‌న్ సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యాన‌ల్ నుంచి ఎనిమిది మంది, మ‌న ప్యాన‌ల్ నుంచి ముగ్గురు గెలుపొందారు.
ప్రొగ్రెసివ్ ప్యాన‌ల్ మ‌ద్ద‌తుతో సురేష్ బాబు ఫిల్మ్ ఛాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఉపాధ్య‌క్షులుగా సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, భ‌ర‌త్ చౌద‌రి, పి.కిర‌ణ్‌, సెక్ర‌ట‌రీగా కే అశోక్ కుమార్‌, కేవీవీ ప్ర‌సాద్ (విజ‌య‌వాడ‌) నియ‌మితుల‌య్యారు. జాయింట్ సెక్ర‌ట‌రీలుగా విజ‌యేంద‌ర్‌రెడ్డి, మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల (హైద‌రాబాద్‌), వీర‌నారాయ‌ణ బాబు (విజ‌య‌వాడ‌), మ‌హేశ్వ‌ర‌రెడ్డి (గుంత‌క‌ల్‌), అప్ప‌ల‌రాజు (వైజాగ్‌) ఎన్నియ్యారు. ట్రెజ‌ర‌ర్‌గా ముత్యాల రాందాసు ఎన్నిక‌య్యారు. 2027 జూలై వ‌ర‌కు ఈ నూత‌న కార్య‌వ‌ర్గం కొన‌సాగుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement