త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suhas | కోలీవుడ్ సినిమాలో విల‌న్‌గా టాలీవుడ్ హీరో – 75 కోట్ల బ‌డ్జెట్‌తో డెబ్యూ మూవీ

టాలీవుడ్ హీరో సుహాస్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మండాడి పేరుతో స్పోర్ట్స్ యాక్ష‌న్ మూవీ చేస్తోన్నాడు. దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో సుహాస్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Apr 25, 2026, 7.13 pm IST

Suhas | కోలీవుడ్ సినిమాలో విల‌న్‌గా టాలీవుడ్ హీరో – 75 కోట్ల బ‌డ్జెట్‌తో డెబ్యూ మూవీ
Advertisement

Suhas | టాలీవుడ్ హీరో సుహాస్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మండాడి పేరుతో త‌మిళంలో స‌ర్వైవ‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు. సూరి హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీకి మ‌థిమార‌న్ పుగ‌ళేంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌త్స‌కారుల బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న మండాడి షూటింగ్ పూర్త‌య్యింది.

సెయిల్ బోట్‌...

సెయిల్‌బోట్ రేసింగ్ కాన్సెప్ట్‌తో త‌మిళంలో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. కాన్సెప్ట్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ కొత్త‌గా ఉంటాయ‌ట‌. దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ త‌మిళ మూవీ రూపొందుతోంద‌ట‌. మండాడితోనే సుహాస్ త‌మిళంలోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా అత‌డు క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం సుహాస్ వంద రోజుల డేట్స్ కేటాయించిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. సూరితో పాటు సుహాస్‌ క్యారెక్ట‌రైజేష‌న్‌, లుక్ కొత్త‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

మ‌హిమా నంబియార్‌...

మండాడిలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుతున్నామ‌ని, త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను వెల్ల‌డిస్తామ‌ని నిర్మాత‌లు అన్నారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

బ్యాడ్‌టైమ్‌...

తెలుగులో క‌మెడియ‌న్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సుహాస్ క‌ల‌ర్ ఫొటో మూవీతో హీరోగా మారాడు. కామెడీ క‌థ‌తో సుహాస్ చేసిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ మంచి విజ‌యాన్ని సాధించింది. అంబాజీ పేట మ్యారేజీ బ్యాండుతో పాటు ప్ర‌స‌న్న‌వ‌ద‌నం సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు. క‌థ‌ల ఎంపిక‌లో పొర‌పాట్ల కార‌ణంగా గ‌త కొన్నాళ్లుగా సుహాస్ బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. ఇటీవ‌ల హే బ‌ల్‌వంత్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.ఈ సినిమా కూడా ప‌రాజ‌యంగానే నిలిచింది.

Advertisement
Advertisement