త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinidhi Shetty | ఆదర్శ కుటుంబంపైనే శ్రీనిధి ఆశలు..!

Srinidhi Shetty | కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్‌ మూవీతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఈ బ్యూటీ బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేరు ఇంజినీర్‌గా పని చేసింది.

P

Entertainment | Published On Mar 18, 2026, 3.05 pm IST

Srinidhi Shetty | ఆదర్శ కుటుంబంపైనే శ్రీనిధి ఆశలు..!
Advertisement

Srinidhi Shetty | కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్‌ మూవీతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఈ బ్యూటీ బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేరు ఇంజినీర్‌గా పని చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్‌ అవకాశం తలుపుతట్టింది. ఉద్యోగం చేస్తూనే పలు అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే మిస్‌ కర్నాటక అండ్‌ మిస్‌ బ్యూటీ ఫైల్‌, మిస్ సుప్రానేషనల్ వంటి ప్రతిష్ఠాత్మక టైటిల్స్‌ను గెలిచింది.

ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్‌, స్లోవేకియా, పోలాండ్ తదితర దేశాల్లో జరిగిన అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడ స్టార్‌ యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ సిరీస్‌లో నటించింది. కేజీఎఫ్‌ ఫ్రాంచైజీల్లో వచ్చిన ఈ రెండు చిత్రాలు ఏకంగా రూ.1250 కోట్లు రాబట్టాయి. దాంతో దేశంలో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత కోబ్రా మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హిట్‌- మూవీలో కనిపించింది. ఈ మూవీలో నానికి జోడీగా నటించింది. అనంతరం తెలుసు కదా మూవీలో నటించింది. టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా మూవీలో మెరిసింది శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం వెంకటేశ్‌ సరసన ఆదర్శ కుటుంబం మూవీలో నటిస్తుంది. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ కోసం చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ మూవీకి సమ్మర్‌లో వస్తుందని అందరూ భావించారు. తాజాగా ఈ మూవీని అక్టోబర్‌ 2న విడుదల చేయాలని సమాచారం. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించనున్నారని టాక్‌. మూవీ షూటింగ్ దుబాయిలో చేయాలని చిత్రం యూనిట్‌ భావించింది. ప్రస్తుతం గల్ఫ్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వస్తున్నట్లుగా టాక్‌. భద్రతా కారణాలు, ఇతర పరిస్థితుల దృష్ట్యా దుబాయి షెడ్యూల్‌ను మారుస్తారా? వాయిదా వేయాలా అనేది దర్శకుడు త్రివిక్రమ్, టీమ్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా ఈ మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. శ్రీనిధి భారీగా అంచనాలు పెట్టుకుంది. ఈ మూవీ హిట్‌గా నిలిస్తే టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement