త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | డాక్ట‌ర్ శ్రీలీల.. ఎంబీబీఎస్ చ‌దువు’కొన్న‌దా’?

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఇటీవ‌లే డాక్ట‌ర్ మారింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఎంబీబీఎస్ ప‌ట్టా అందుకుంది. అయితే ఆమె ఎంబీబీఎస్ డిగ్రీపై సోష‌ల్ మీడియాలో మాత్రం అనేక రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. సినిమాల‌తో బిజీగా ఉండి కాలేజీకి ఎలా అటెండ్ అయ్యిందంటూ ట్వీట్స్ పెడుతున్నారు.

N

Entertainment | Published On Feb 24, 2026, 4.48 pm IST

Sreeleela | డాక్ట‌ర్ శ్రీలీల.. ఎంబీబీఎస్ చ‌దువు’కొన్న‌దా’?
Advertisement

Sreeleela | టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీలీల ఇటీవ‌లే డాక్ట‌ర్‌గా ప్ర‌మోష‌న్ పొందింది. ఎంబీబీఎస్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన ఈ ధ‌మాకా బ్యూటీ డాక్ట‌ర్ ప‌ట్టా అందుకుంది. శ్రీలీల ఎంబీబీఎస్ ప‌ట్టా అందుకున్న కాలేజీ కాన్వ‌కేష‌న్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. డాక్ట‌ర్‌గా మారిన ఈ బ్యూటీపై సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ఆమె ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపించారు. యాక్ట‌ర్ నుంచి డాక్ట‌ర్‌గా మారిన అతి త‌క్కువ మందిలో శ్రీలీల ఒక‌రంటూ తెగ పొగిడేశారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం శ్రీలీల ఎంబీబీఎస్ డిగ్రీపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

75 శాతం అటెండెన్స్‌...

ఇండియాలో ఉన్న రూల్స్ ప్ర‌కారం వైద్య‌విద్య‌ను అభ్య‌సించ‌డం అంత ఈజీ కాదు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలంటే ఖ‌చ్చితంగా 75 శాతానికిపైగా అటెండెన్స్ ఉండాలి. అంతే కాకుండా నాలుగున్న‌రేళ్లతో పాటు అద‌నంగా మ‌రో ఏడాది క్లినిక‌ల్ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్‌లో కూడా 80 శాతం వ‌ర‌కు అటెండెన్స్ ఉండాల్సిందే. లేదంటే ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌రు.

మానుషి చిల్ల‌ర్‌...

అటెండెన్స్ లేద‌నే కార‌ణంగానే బాలీవుడ్ హీరోయిన్ మానుషి చిల్ల‌ర్ త‌న ఎంబీబీఎస్‌ను మ‌ధ్య‌లోనే వ‌దిలేయాల్సివ‌చ్చింది. కానీ శ్రీలీల విష‌యంలో మాత్రం ఎలా సాధ్య‌మైంద‌ని నెటిజ‌న్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 2020 ఏడాదిలో శ్రీలీల ఎంబీబీఎస్‌లో జాయిన్ అయ్యింది. 2025లో కంప్లీట్ చేసింది. ఈ ఐదున్న‌రేళ్ల గ్యాప్‌లో శ్రీలీల తెలుగుతో పాటు త‌మిళంలో ప‌దిహేనుకుపైగా సినిమాలు చేసింది. ఏడాదికి మూడు, నాలుగు సినిమాల షూటింగ్‌లు, వాటి ప్ర‌మోష‌న్స్‌, యాడ్స్‌, స్పెష‌ల్ సాంగ్స్‌...ఇలా వీట‌న్నింటితో బిజీగా ఉంటూ శ్రీలీల ఎలా ఎంబీబీఎస్ క్లాస్‌ల‌కు అటెండ్ అయ్యింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.
మార్నింగ్ ఓ షూటింగ్‌, మ‌ధ్యాహ్నం మ‌రో షూటింగ్ అనేంత‌గా బిజీగా మారిపోయింది శ్రీలీల‌. అంత బిజీలో శ్రీలీల 75 ప‌ర్సెంట్ అటెండెన్స్ ఎలా సాధ్య‌మైంద‌నేది అర్థం కావ‌డం లేదంటూ నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.

సెలిబ్రిటీ హోదాలో...

శ్రీలీల ఎంబీబీఎస్ చ‌దువుకున్న డీవై పాటిల్ కాలేజీ ప్రైవేటు డీమ్డ్ యూనివ‌ర్సిటీ. శ్రీలీల సెలిబ్రిటీ కావ‌డంతో అటెండెన్స్ తో పాటు క్లినిక‌ల్ ప్రాక్టీస్ విష‌యంలో ఆమెకు కాలేజీ యాజ‌మాన్యం చాలానే మిన‌హాయింపులు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శ్రీలీల త‌ల్లి కూడా డాక్ట‌ర్ కావ‌డంతో ఆ బ్యాక్‌గ్రౌండ్ కూడా హెల్ప‌య్యింద‌ని సోష‌ల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. శ్రీలీల ఎంబీబీఎస్ చ‌దువు కున్న‌ది కాద‌ని...కొన్న‌ద‌ని కామెంట్లు పెడుతున్నారు. ఈ రూమ‌ర్ల‌పై శ్రీలీలతో పాటు కాలేజీ యాజ‌మాన్యం మాత్రం రియాక్ట్ కాలేదు.

 

ALSO READ:
Konark Sun Temple | శతాబ్దం తర్వాత తెరుచుకోనున్న కోణార్క్‌ సూర్యనారాయణ దేవాలయం ద్వారాలు..!

Advertisement
Advertisement