Palash Muchhal | పలాశ్ ముచ్చల్‌పై చీటింగ్ కేసు పెట్టిన స్మృతి మంధాన స్నేహితుడు
పలాశ్ ముచ్చల్ పై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా నిర్మిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేశాడని స్మృతి మంధాన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
Entertainment | Published On Jan 22, 2026, 8.12 pm IST
Palash Muchhal | పలాశ్ ముచ్చల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా నిర్మిస్తానని డబ్బులు తీసుకొని పలాశ్ మోసం చేశాడని అతడిపై స్మృతి మంధాన స్నేహితుడు ఒకరు కేసు పెట్టారు. స్మృతి మంధానతో పలాశ్ ముచ్చల్ పెళ్లి గత ఏడాది నవంబర్ 23న జరగాల్సింది. డీవై పాటిల్ స్టేడియంలో స్మృతి మంథానకు సినిమా స్టైల్‌లో ప్రపోజ్ చేశాడు పలాశ్. ఆ తర్వాత గ్రాండ్‌గా పెళ్లి ఏర్పాట్లు చేశారు. వివాహం జరగాల్సిన రోజే స్మృతి మంధాన తండ్రి హాస్పిటల్ పాలయ్యాడు. ఆ తర్వాత పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. అనంతరం జరిగిన నాటకీయ పరిణామాలతో తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు స్మృతి మంధానతో పాటు పలాశ్ ముచ్చల్ వేర్వేరుగా ప్రకటనలు రిలీజ్ చేశారు. అందుకు కారణాలేమిటన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.
సినిమా చేస్తానని...
తాజాగా పలాశ్ ముచ్చల్‌పై మహారాష్ట్రలోని సాంగ్లీ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. నజరియా పేరుతో తన నిర్మాణంలో పలాశ్ ముచ్చల్ ఓ సినిమా చేస్తానని నలభై లక్షలు డబ్బులు తీసుకున్నాడని వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలాష్ ఆ సినిమాను పూర్తిచేయలేదని వైభవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడని, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, తన నంబర్‌ను కూడా బ్లాక్ చేశారని వైభవ్ మానే పోలీసులకు కంప్లైట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందజేశాడట వైభవ్. పలాశ్ ముచ్చల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
పలాశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైభవ్ మానే స్మృతి మంధానకు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ద్వారా పలాశ్‌కు వైభవ్‌తో పరిచయం ఏర్పడిందట. పలాశ్ ముచ్చల్ పలు బాలీవుడ్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా, స్టోరీ రైటర్‌గా పనిచేశాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





