త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singer Mangli | మంగ్లీ పేరుతో మోసాలు – త‌న‌కు సంబంధం లేదంటూ సింగ‌ర్ క్లారిటీ

సింగ‌ర్ మంగ్లీ మ‌రో వివాదంలో చిక్కుకుంది. మంగ్లీ పేరుతో మైక్రో ఫైనాన్స్ పేరిట‌ కొంద‌రు డ‌బ్బులు వ‌సూలు చేస్తూ మోసాలుకు పాల్ప‌డుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. త‌న‌కు ఈ మైక్రో ఫైనాన్స్ వ్యాపారాల‌కు సంబంధం లేద‌ని అన్న‌ది.

N

Entertainment | Published On Mar 23, 2026, 5.07 pm IST

Singer Mangli | మంగ్లీ పేరుతో  మోసాలు – త‌న‌కు సంబంధం లేదంటూ సింగ‌ర్ క్లారిటీ
Advertisement

Singer Mangli | బూతు పాట ర‌చ్చ‌ మ‌రువ‌క ముందే సింగ‌ర్ మంగ్లీ మ‌రో వివాదంలో చిక్కుకుంది. సింగ‌ర్ మంగ్లీ పేరుతో కొంద‌రు పేరుతో డ‌బ్బులు వ‌సూలు చేస్తూ కోట్ల రూపాయ‌లు మోసాల‌కు పాల్ప‌డుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ స్కామ్‌కు సింగ‌ర్ మంగ్లీతో పాటు ఆమె త‌మ్ముడు శివ‌కు సంబంధం ఉన్న‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమ‌ర్ల‌పై సింగ‌ర్ మంగ్లీ రియాక్ట్ అయ్యింది. సోమ‌వారం ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. మైక్రో ఫైనాన్స్ మోసాల‌కు త‌న‌తో పాటు త‌న కుటుంబానికి ఎలాంటి సంబంధం లేద‌ని అన్న‌ది. కొంద‌రు కావాల‌నే త‌న‌ను ఈ వివాదంలోకి లాగి వ్య‌క్తిగ‌త పేరు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని అన్న‌ది.

సంబంధం లేదు...

"మైక్రోఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేశారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫేషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజు చాలా మంది సంప్రదిస్తుంటారు, ఆ ఈవెంట్ కు సంబందించిన ఇన్విటేషన్ వివరాల వరకే గాని, వాళ్ల పర్సనల్ వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ స‌భ్యుల‌కు ఏ మాత్రం సంబంధంలేని విషయం. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నాపేరును వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయటం చాలా అన్యాయం..
కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియెలకు, మా ఇంటికి ఎలాంటి సంబంధంలేదు.

నా ప్రొఫేషన్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరుచెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మవద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్ మెంట్ ను కోరుతున్నాను" అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్న‌ది.

క్ష‌మాప‌ణ‌లు...

ఇటీవ‌ల రిలీజైన కేడీ ది డెవిల్ మూవీలో స‌ర్కే చునార్ తేరీ స‌ర్కే సాంగ్ వివాదాస్ప‌దంగా మారింది. ఈ పాట‌లోని అశ్లీల సాహిత్య‌, డ్యాన్స్‌పై నెటిజ‌న్ల‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాలు సైతం విమ‌ర్శ‌లు గుప్పించారు. వివాదం పెద్ద‌ది కావ‌డంతో మేక‌ర్స్‌తో పాటు మంగ్లీ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఈ పాట‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement