Singer Chinmayi | చిరంజీవి వ్యాఖ్యలకు చిన్మయి కౌంటర్.. ‘ఇక్కడ కమిట్‌మెంట్ అంటే అర్థం వేరే..’
Singer Chinmayi | తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి లేదని చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన చిన్మయి, సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.
Entertainment | Published On Jan 27, 2026, 10.37 am IST
Singer Chinmayi | తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి లేదని చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన చిన్మయి, సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. విదేశాల నుంచి భారత్‌కు వచ్చి, సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించిన ఓ మహిళకు ఎదురైన మాటల దాడికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె షేర్ చేశారు. దానిపై స్పందిస్తూ, 'సినీ పరిశ్రమలో ఫుల్ కమిట్‌మెంట్ అనే పదానికి వేరే అర్థం ఉంటుంది. అది వృత్తిపరమైన నిబద్ధత కాదు. చాలాసార్లు అది లైంగిక డిమాండ్లకు సంకేతం. అలా చేయని మహిళలకు అవకాశాలు రావడం లేదు,' అన్నారు.
కమిట్‌మెంట్ అంటే ఇక్కడ వేరే అర్థం: చిన్మయి
ఇంగ్లిష్ విద్యాభ్యాసం చేసినవారు కమిట్‌మెంట్ అంటే పని పట్ల నిబద్ధత అని భావిస్తారని, కానీ సినిమా రంగంలో అది పూర్తిగా భిన్నమని ఆమె అన్నారు. 'పురుషులు తమకు అధికారం ఉందని భావిస్తూ, మహిళల నుంచి లైంగిక అనుకూలతలు ఆశిస్తారు, డిమాండ్ చేస్తారు. ఇదే అసలు సమస్య,' అని చిన్మయి స్పష్టం చేశారు. పరిశ్రమలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మరో రెండు ఘటనలను కూడా ఆమె ప్రస్తావించారు. ఓ ప్రముఖ సంగీతకారుడు స్టూడియోలో ఓ యువ సంగీత కళాకారిణిపై లైంగిక దాడికి యత్నించగా, ఆమె సౌండ్ బూత్‌లో తలుపులు వేసుకుని దాక్కొని, మరో సీనియర్ వ్యక్తి వచ్చి రక్షించే వరకు బయటకు రాలేదని తెలిపారు. ఆ సంఘటన తర్వాత ఆ యువతి పూర్తిగా ఆ వాతావరణాన్ని వదిలేసిందని పేర్కొన్నారు. అలాగే, మరో పురుష గాయకుడు మహిళలతో అనుచితంగా ప్రవర్తించడం, అశ్లీల ఫోటోలు పంపించడం, లైంగిక సంబంధాల కోసం బలవంతం చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రేక్షకులు అతడిని తిరిగి వేదికలపై ఆహ్వానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'మహిళలపై లైంగిక వేధింపులు పరిశ్రమలో చాలా పెద్ద సమస్య,' అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు.
Casting couch is rampant, women are refused roles if they don’t offer ‘full commitment’ - a word that means completely different in the film industry.
If you come from an English educated background and believe ‘commitment’ means ‘professionalism’, showing up to work and being…
— Chinmayi Sripaada (@Chinmayi) January 26, 2026
ఒకప్పటిలా ఇప్పుడు లేదు..
చిరంజీవి వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయనను వ్యక్తిగతంగా గౌరవిస్తూనే, ఆయన తరం భిన్నమైన పరిస్థితుల్లో పెరిగిందని చిన్మయి చెప్పారు. 'చిరంజీవి ఒక లెజెండ్. ఆయన తరం నటీనటులు పరస్పరం కుటుంబ మిత్రుల్లా ఉండేవారు. మహిళా సహనటులతో పరస్పర గౌరవంతో పనిచేసేవారు. వాళ్లందరూ గొప్ప కళాకారులే. కానీ ఇప్పటి పరిస్థితులు ఒకప్పటిలా లేవు,' అని అన్నారు. మీటూ ఉద్యమంపై కూడా చిన్మయి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'మీటూ ఉద్యమాన్ని ఒక తరం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. షావుకారు జానకి వంటి వారు కూడా తమపై జరిగిన వేధింపులను బయటపెట్టిన మహిళలను అవమానించారు. మహిళలు మాట్లాడటం వారి కుటుంబాలకు అవమానమని వ్యాఖ్యానించారు. ఇది బాధాకరం,' అని పేర్కొన్నారు.
తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చిన్మయి మరోసారి గుర్తుచేశారు. 'వైరముత్తు నన్ను వేధించాడు. ఆయనను గురువులా, గొప్ప కవిగా గౌరవించాను. ఆయన ప్రమాదకరమైన వ్యక్తి అనుకోలేదు. నా తల్లి అదే ప్రాంగణంలో ఉన్నా కూడా ఆయన నన్ను వేధించాడు. తల్లిదండ్రులు పక్కన ఉన్నా కూడా ఇలాంటి మనుషులు మారరు,' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా మన శంకర వర ప్రసాద్ గారు చిత్ర సక్సెస్ మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ, 'సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థ లేదు. అది వ్యక్తిగత సమస్య. పరిశ్రమ అద్దంలాంటిది, మీరు ఎలా ఉంటే అలాగే ప్రతిబింబిస్తుంది,' అన్నారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సినీ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. చిన్మయి స్పందనతో ఈ అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ వాస్తవమా, అవాస్తవమా, మహిళల భద్రత, పరిశ్రమలో పవర్ ఫుల్ వ్యక్తులు.. వంటి అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



