త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | సిగ‌రెట్ తాగుతూ శృతిహాస‌న్‌ – బ‌ర్త్‌డే రోజు బోల్డ్ పోస్ట‌ర్‌తో స‌ర్‌ప్రైజ్‌

మూడేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది శృతిహాస‌న్‌. దుల్క‌ర్ స‌ల్మాన్ ఆకాశంలో ఒక తార మూవీలో శృతిహాస‌న్ న‌టించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. సిగ‌రెట్ తాగుతూ బోల్డ్ లుక్‌లో శృతి హాస‌న్ క‌నిపిస్తున్న ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు

N

Entertainment | Published On Jan 28, 2026, 4.07 pm IST

Shruti Haasan | సిగ‌రెట్ తాగుతూ శృతిహాస‌న్‌ – బ‌ర్త్‌డే రోజు బోల్డ్ పోస్ట‌ర్‌తో స‌ర్‌ప్రైజ్‌
Advertisement

Shruti Haasan | శృతి హాస‌న్ తెలుగులో సినిమా చేసి మూడేళ్లు దాటిపోయింది. చివ‌ర‌గా ప్ర‌భాస్ స‌లార్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ యాక్ష‌న్ మూవీ పెద్ద హిట్ట‌యిన శృతి హాస‌న్‌కు మాత్రం అవ‌కాశాలు అంత‌గా రాలేదు. దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది.
దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా ఆకాశంలో ఒక తార పేరుతో ఈ అడ్వెంచ‌ర్ డ్రామా మూవీ తెర‌కెక్కుతోంది. ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాత్విక వీర‌వ‌ల్లి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఆకాశంలో ఒక తార మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.

స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌...

తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఇందులో శృతిహాస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నోటిలో సిగ‌రెట్ పెట్టుకొని బోల్డ్‌ లుక్‌లో శృతి హాస‌న్ క‌నిపిస్తోంది. పోస్ట‌ర్ చూస్తుంటే ఈ సినిమాలో శృతి హాస‌న్ క్యారెక్ట‌ర్ ఆధునిక‌ ఛాయ‌ల‌తో ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. శృతిహాస‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

తొలుత ఈ పాత్ర కోసం రుహాణీ శ‌ర్మ‌ను అనుకున్నార‌ట మేక‌ర్స్‌. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆమెను ప‌క్క‌న‌పెట్టి శృతి హాస‌న్‌ను సెలెక్ట్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రోడ్డు కూడా స‌రిగ్గా లేని ప‌ల్లెటూరిలో పుట్టిన ఓ అమ్మాయి అంత‌రిక్షంలో అడుగుపెట్టాల‌నే త‌న క‌ల‌ను ఎలా సాకారం చేసుకుంది? ఆమె క‌ల‌కు అండ‌గా నిలిచిన యువ‌కుడు ఎవ‌రూ అనే కాన్సెప్ట్‌తో ఆకాశంలో ఒక తార‌ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్ రైతు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌కు ఓటీటీ రైట్స్‌...

ఆకాశంలో ఒక తార మూవీని మార్చిలో రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తికాక‌ముందే ఈ సినిమా ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోయాయి. డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ‌లు స్వ‌ప్న సినిమాస్‌, గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

.

Advertisement

తాజావార్తలు

Advertisement