త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | పెద్ది స్పెషల్‌ సాంగ్‌లో శృతి హాసన్‌.. ఈనెల 26 నుంచి జన్వాడలో షూటింగ్‌..!

Shruti Haasan | రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం స్పెషల్‌ సాంగ్‌లో శ్రుతి హాసన్‌ తీసుకుంది. గతంలో పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారం కాగా.. చివరికి ఆ హై-ఎనర్జీ సాంగ్‌కు శ్రుతి హాసన్‌ వైపు మేకర్స్‌ మొగ్గుచూపినట్లు సమాచారం.

P

Entertainment | Published On Apr 22, 2026, 7.44 pm IST

Shruti Haasan | పెద్ది స్పెషల్‌ సాంగ్‌లో శృతి హాసన్‌.. ఈనెల 26 నుంచి జన్వాడలో షూటింగ్‌..!
Advertisement

Shruti Haasan | బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రుతి హాసన్‌ను చిత్రబృందం ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కోసం ముందుగా మృణాల్ ఠాకూర్, నయన్ సారిక, మానస వారణాసి, సంయుక్త వంటి పలువురి పేర్లు వినిపించినప్పటికీ, చివరికి శ్రుతి హాసన్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, శ్రుతి హాసన్ గతంలో ‘ఎవడు’ చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ తెరపై కనిపించనుండటంతో ఆసక్తి పెరిగింది.

ఈ పాట షూటింగ్ ఏప్రిల్ 26న హైదరాబాద్‌ జన్వాడ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు చిత్రీకరణ జరగనుంది. ‘పెద్ది’ మొత్తం షూటింగ్ ఏప్రిల్ 30 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ముందుగా దర్శకుడు బుచ్చిబాబు ఆరు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పినప్పటికీ, తాజా షెడ్యూల్ ప్రకారం ఆ అంచనాల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జూన్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నప్పటికీ, అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు పొందిన బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’పై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండడం మరో ప్రత్యేకత. తెలుగులో ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన ‘చికిరి’ సాంగ్ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మొత్తానికి శ్రుతి హాసన్ ఎంట్రీతో ‘పెద్ది’పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. రామ్ చరణ్–శ్రుతి కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది. శ్రుతి హాసన్ గతంలో మహేశ్‌ బాబు నటించిన ‘ఆగడు’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇది ఆమెకు రెండో తెలుగు స్పెషల్ సాంగ్‌గా నిలవనుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ఆకాశంలో ఓ తార’, తమిళంలో ‘ట్రైన్’ సినిమాల్లో నటిస్తోంది.

Advertisement
Advertisement