Shraddha Kapoor | చిన్నారి అభిమానిని కలిసిన శ్రద్ధా కపూర్.. వైరల్‌గా మారిన క్యూట్ వీడియో..!
Shraddha Kapoor | బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఎక్కడికి వెళ్లినా సందడి కనిపిస్తుంది. ఆమె కనిపించిందంటే చాలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Entertainment | Published On Mar 27, 2026, 1.10 pm IST
Shraddha Kapoor | బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఎక్కడికి వెళ్లినా సందడి కనిపిస్తుంది. ఆమె కనిపించిందంటే చాలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో శ్రద్ధా కపూర్ పలువురు అభిమానులను ప్రేమగా పలకరిస్తూ కనిపించింది. అందరిలోకన్నా ఒక చిన్నారి అభిమానిని కలువడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ చిన్నారి తో మాట్లాడిన తీరు, ఆమెపై చూపిన ఆప్యాయత వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంలో ఫొటోగ్రాఫర్లు శ్రద్ధా కపూర్, ఆ చిన్నారి కలిసి ఉన్న ఫొటోలను పెద్ద ఎత్తున క్లిక్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ముఖ్యంగా చిన్నారి అభిమానితో శ్రద్ధా కపూర్ ప్రవర్తించిన తీరు అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.
‘బాలీవుడ్‌లో క్యూట్ హీరోయిన్ ఇమే’ అని ఒక అభిమాని కామెంట్ చేయగా.. మరొకరు ‘చాలా క్యూట్‌గా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. ‘చిన్నారి ఫ్యాన్‌తో శ్రద్ధా కపూర్ ఇంకా అందంగా కనిపిస్తోంది’ అంటూ మరికొందరు స్పందించారు. చాలా మంది అభిమానులు ఈ వీడియోపై రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలతో తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘ఈతా’ (Eetha) అనే బయోగ్రాఫికల్ డ్రామా చిత్రంలో నటించనుంది. ఈ సినిమా ప్రముఖ మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణగావంకర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మ్యాడాక్స్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్నారు. 1950 నుంచి 1980 దశకాల మధ్య మహారాష్ట్ర సంస్కృతి, జానపద కళను ఈ సినిమాలో ప్రతిబింబించనున్నారు. ఇందులో రందీప్ హుడా సైతం కీలక పాత్రలో నటిస్తున్నాడు.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



