త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | శంబాల వ‌ర్సెస్ ఛాంపియ‌న్ – ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌లో టాప్ ఎవ‌రంటే?

ఈ వారం రిలీజైన సినిమాల్లో ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఛాంపియ‌న్ టాప్‌లో నిలిచింది. తొలిరోజు ఈ సినిమా 4.50 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు నిర్మాత‌లు వెల్ల‌డించారు. ఆది సాయికుమార్ శంబాల మూవీ 3.3 కోట్ల‌తో క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుంది.

N

Entertainment | Published On Dec 26, 2025, 3.29 pm IST

Tollywood | శంబాల వ‌ర్సెస్ ఛాంపియ‌న్ – ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌లో టాప్ ఎవ‌రంటే?
Advertisement

Tollywood | 2025 ఇయ‌ర్ ఎండింగ్ టాలీవుడ్‌కు క‌లిసివ‌చ్చింది. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ఐదు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో రూపొందిన ఈ చిన్న సినిమాల‌న్ని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.
ఈ ఐదు సినిమాల్లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఛాంపియ‌న్ టాప్‌లో నిలిచింది. ఈ సినిమా ఫ‌స్ట్ డే 4.50 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఓ ప్రేమ‌క‌థ‌ను జోడించి ఫిక్ష‌న‌ల్ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ అద్వైతం ఛాంపియ‌న్‌ను రూపొందించారు. రోష‌న్ మేక‌, అన‌స్వ‌ర యాక్టింగ్‌తో పాటు టెక్నిక‌ల్‌గా ఛాంపియ‌న్ బాగుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాన్సెప్ట్‌ను న‌మ్మి దాదాపు 45 కోట్ల బ‌డ్జెట్‌తో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్ ఈ సినిమాను నిర్మించిన‌ట్లు టాక్‌. మిక్కీ జే మేయ‌ర్ ఛాంపియ‌న్ మూవీకి మ్యూజిక్ అందించారు. పెళ్లి సంద‌డి త‌ర్వాత రోష‌న్ మేక హీరోగా న‌టించిన సెకండ్ మూవీ ఇది.

శంబాల‌...

శంబాల‌తో లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆదికి మంచి హిట్టు ద‌క్కేలా క‌నిపిస్తోంది. గురువారం రిలీజైన ఈ మూవీ తొలి రోజు యునాన‌మ‌స్‌గా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొద‌టిరోజు శంబాల 3.3 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ ద్వారా నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. సెకండ్ డే నుంచి సినిమాకు థియేట‌ర్లు పెరిగిన‌ట్లు చెప్పారు. మైథాల‌జీ అంశాల‌కు హార‌ర్ ఎలిమెంట్స్ జోడించి డైరెక్ట‌ర్ యుగంధ‌ర్ ముని శంబాల సినిమాను రూపొందించారు. శంబాల లో అర్చ‌నా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

ఈషా...

మిక్స్‌డ్ టాక్‌తో చిన్న సినిమా ఈషా బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. ఈ హార‌ర్ మూవీకి ఫ‌స్ట్ డే 2. 18 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. త్రిగుణ్, ఈషారెబ్బా, సిరి హ‌నుమంతు, అఖిల్ రాజ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈషాకు శ్రీనివాస్ మ‌న్నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
ఈ వారం రిలీజైన సినిమాల్లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా దండోరా, ప‌తంగ్ లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి. దండోరా మూవీకి పాజిటివ్ టాక్ వ‌చ్చినా క‌లెక్ష‌న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాబ‌ట్ట‌లేక‌పోయింది. తొలిరోజు అతి క‌ష్టంగా ఈ మూవీ 45 ల‌క్ష‌ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. శివాజీ వివాదం కూడా దండోరాకు అంత‌గా క‌లిసిరాన‌ట్లుగానే క‌నిపిస్తోంది. ప‌తంగ్ కూడా 20 ల‌క్ష‌ల లోపే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement