OTT | ఓటీటీలోకి అర్జున్ కూతురి రొమాంటిక్ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?
సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ సీతాపయనం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. మార్చి 20 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. సీతాపయనం మూవీలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Mar 15, 2026, 3.05 pm IST
OTT |సీనియర్ హీరో అర్జున్ యాక్షన్ సినిమాలతో తెలుగులో ఎన్నో విజయాలను అందుకున్నారు. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా కొన్ని సినిమాల్లో నటించి వైవిధ్యతను చాటుకున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన అర్జున్ ఇటీవలే సీతాపయనం పేరుతో ఓ మూవీని తెరకెక్కించాడు.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నిరంజన్ హీరోగా నటించిన ఈ మూవీలో అర్జున్ తో పాటు సత్యరాజ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
సన్ నెక్స్ట్ ఓటీటీలో...
తాజాగా సీతాపయనం మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 20 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరో ఒకటి రెండు రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతున్నారు.
విశ్వక్‌సేన్‌తో అనుకొని...
సీతాపయనం మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. తొలుత ఈ సినిమాను విశ్వక్‌సేన్‌తో చేయాలని అనుకున్నారు అర్జున్. అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ మొదలుకాకముందే అర్జున్, విశ్వక్‌సేన్ మధ్య విభేదాలు నెలకొనడంతో సినిమా ఆగిపోయింది. విశ్వక్‌సేన్ స్థానంలో నిరంజన్‌ను హీరోగా తీసుకొని సీతాపయనం మూవీని తెరకెక్కించాడు.
అభి, సీత జర్నీ...
సీత చెఫ్. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సీతను తండ్రి రాజేంద్రప్రసాద్ కష్టపడి పెంచి పెద్దచేస్తాడు. ఓ పనిమీద హైదరాబాద్ బయలుదేరుతుంది. మధ్యలో కారు చెడిపోవడంతో ఆమెకు అభి (నిరంజన్) అనే యువకుడు లిఫ్ట్ ఇస్తాడు. ఈ జర్నీలో ఏం జరిగింది. దారిలో వారికి ఎదురైన వ్యక్తులు ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు




