త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Sarovar | గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే

Gandhi Sarovar | రేవంత్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మూసీ పున‌రుజ్జీవ‌నంలో భాగంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించింది. బాపూఘాట్ ను గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసేందుకు ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భూముల్లో నిర్మాణాలు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్పింది.

S

Telangana | Published On Jun 19, 2026, 7.24 pm IST

Gandhi Sarovar | గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే
Advertisement

Gandhi Sarovar | త్రినేత్ర‌.న్యూస్‌: రేవంత్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మూసీ పున‌రుజ్జీవ‌నంలో భాగంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించింది. బాపూఘాట్ ను గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసేందుకు ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భూముల్లో నిర్మాణాలు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌, డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది.

లంగ‌ర్ హౌజ్‌లోని బాపూఘాట్‌ను గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసేందుకు గోల్కొండ ఆర్టిల‌రీ సెంట‌ర్‌కు చెందిన 83.814 ఎక‌రాల ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ భూమిలో ఈక్వ‌ల్ వాల్యూ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ (స‌మాన విలువ మౌలిక స‌దుపాయాలు) ప్రాతిప‌దిక‌న నిర్మాణాలు చేసేందుకు అనుమ‌తించింది. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌, భార‌త ఆర్మీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మూసీ పున‌రుజ్జీవ‌నంలో ఈ ప‌రిణామం కీల‌కంగా నిలిచిపోతుంద‌ని కొనియాడారు.

Advertisement
Advertisement