Sara Arjun | సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్ – ధురంధర్ 2 హీరోయిన్‌కు చేదు అనుభవం
ధురంధర్ 2 హీరోయిన్ సారా అర్జున్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీ దిగేందుకు ఎగబడటంతో సారా అర్జున్ ఇబ్బందులు పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Mar 30, 2026, 7.05 pm IST
Sara Arjun | ధురంధర్ 2 హీరోయిన్ సారా అర్జున్‌కు అభిమానులు చుక్కలు చూపించారు. సెల్ఫీల కోసం ఎగబడటంతో ఇబ్బంది పడింది. ధురంధర్ 2 సక్సెస్ జోష్‌లో ఉన్న సారా అర్జున్ ఆదివారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ వీక్షించడానికి వచ్చింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జెర్సీ ధరించి ఈ మ్యాచ్‌కు హాజరైంది. సారా అర్జున్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు రాజ్ అర్జున్, సాన్యా అర్జున్ కూడా స్టేడియానికి వచ్చారు. మ్యాచ్ ఆసాంతం ముంబై ఇండియన్స్ టీమ్‌ను ఎంకరేజ్ చేస్తూ సారా అర్జున్ కనిపించింది. ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
సెల్ఫీల కోసం...
మ్యాచ్ ముగిసిన అనంతరం స్టేడియం బయటకు వచ్చిన సారా అర్జున్‌ను ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. ఫ్యాన్స్ తోపులాటతో ధురంధర్ 2 హీరోయిన్ అసహనానికి గురైంది. చాలా ఇబ్బందిగా కనిపించింది. అభిమానులకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించిన వినలేదు. ఫ్యాన్స్ మధ్య నుంచి సారా అర్జున్‌ను ఆమె తల్లిదండ్రులు క్షేమంగా తీసుకెళ్లారు. కారు ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1300 కోట్ల కలెక్షన్స్...
సారా అర్జున్ హీరోయిన్‌గా నటించిన ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద చరిత్రను సృష్టిస్తోంది. రణవీర్‌సింగ్ హీరోగా నటించిన ఈ బాలీవుడ్ మూవీ 12 రోజుల్లోనే 1300 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన హిందీ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో యలీనా జమాలి అనే పాత్రలో సారా అర్జున్ కనిపించింది. రణవీర్‌సింగ్ ప్రియురాలిగా, భార్యగా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటోంది.ధురంధర్ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కింది. ధురంధర్‌తోనే బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసి సారా అర్జున్. ఇటీవలే యుఫోరియా మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాజిక్ పేరుతో ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేసింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
View this post on Instagram
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






