Samantha | భర్తతో సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్ – బడ్జెట్ ఎక్కువై ఆపేశారా? – డైరెక్టర్ క్లారిటీ
సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్ ఆగిపోయినట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై డైరెక్టర్ రాహి అనిల్ బార్వే క్లారిటీ ఇచ్చాడు. కంటెంట్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఈ సిరీస్ ఆగిపోయినట్లు ప్రకటించాడు.
Entertainment | Published On Feb 12, 2026, 5.31 pm IST
Samantha | ఓటీటీల ట్రెండ్ పెరిగిన తర్వాత సినిమాలకే పరిమితం కావడం లేదు నేటితరం హీరోయిన్లు. మంచి కథలు దొరికితే వెబ్‌సిరీస్‌లలో నటించడానికి రెడీ అంటున్నారు. మిగిలిన స్టార్ హీరోయిన్ల కంటే సమంత ఓ అడుగు ముందే ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో ఐదేళ్ల క్రితమే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సూపర్ హిట్ సిరీస్‌లో విలన్ పాత్రలో అదరగొట్టింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత బాలీవుడ్‌లో సిటాడెల్ హనీ బన్నీతో పాటు రక్త బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్‌లకు అంగీకరించింది సమంత. ఇందులో సిటాడెల్ హనీ బన్నీ గత ఏడాది రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. రక్త్ బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్‌ను అనౌన్స్‌చేసి రెండేళ్లు దాటిపోయినా ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
తుంబాద్ డైరెక్టర్...
తుంబాద్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో రక్త్ బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్‌ను ప్రకటించారు. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కు నిర్మాతలుగా వ్యవహరించారు. సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి, అలీ ఫజల్ ఈ సిరీస్‌లో కీలక పాత్రలు కనిపించబోతున్నట్లు వెల్లడించారు.
క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో...
భారీ బడ్జెట్‌తో సోషియా ఫాంటసీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను అభిమానుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కొంత భాగం షూటింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువైపోవడంతో పాటు క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సిరీస్‌ను పక్కనపెట్టారని ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ మాత్రం అలాంటిదేమి లేదని ప్రకటించారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌తో ముడిపడిన కథ కావడంతో షూటింగ్ ఆలస్యమవుతుందని రూమర్లను కొట్టిపడేశారు.
రిస్క్ తీసుకోని నెట్‌ఫ్లిక్స్...
రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించిన మయసభ మూవీ ఇటీవల రిలీజైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో రక్త్‌బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు డైరెక్టర్. ఈ సిరీస్ ఆగిపోయిన మాట నిజమేనని అన్నారు. కంటెంట్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ అభ్యంతరం వ్యక్తం చేసిందట. వివాదాలకు దారితీసే అవకాశం ఉండటంతో రిస్క్ తీసుకోవద్దని భావించిన నెట్‌ఫ్లిక్స్ షూటింగ్ దశలోనే ఈ సిరీస్‌ను పక్కనపెట్టినట్లు ఇన్‌డైరెక్ట్‌గా రాహి అనిల్ బార్వే ప్రకటించాడు. కథలో హింసా, డార్క్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కథలతో సిరీస్‌లు కూడా తీయడం కష్టంగా మారిందని చెప్పాడు.భర్త నిర్మాణంలో సమంత చేయాల్సిన ఈ సిరీస్ ఆగిపోవడం ఆసక్తికరంగా మారింది.
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి గత ఏడాది డిసెంబర్‌లో జరిగింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం పేరుతో క్రైమ్ కామెడీ సినిమా చేస్తోంది సమంత. ఈ సినిమాను భర్తతో కలిసి సమంత స్వయంగా నిర్మిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






