త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | మా ఇంటి బంగారం సెన్సార్ రివ్యూ – బాషా రేంజ్ ఫ్లాష్‌బ్యాక్ – యాక్ష‌న్ సీన్లు అదుర్స్‌

స‌మంత మా ఇంటి బంగారం సెన్సార్ కంప్లీట్ అయ్యింది. యూ ఏ స‌ర్టిఫిరెట్ వ‌చ్చింది. రెండు గంట‌ల ముప్పై నాలుగు నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఈ క్రైమ్ కామెడీ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సెన్సార్ స‌భ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింద‌ట‌. ర‌జ‌నీకాంత్ బాషా రేంజ్‌లో ఈ సినిమా సాగుతుంద‌ని అంటున్నారు.

N

Entertainment | Published On Jun 11, 2026, 7.38 pm IST

Samantha | మా ఇంటి బంగారం సెన్సార్ రివ్యూ – బాషా రేంజ్ ఫ్లాష్‌బ్యాక్ – యాక్ష‌న్ సీన్లు అదుర్స్‌
Advertisement

Samantha |  స‌మంత మా ఇంటి బంగారం సెన్సార్ టాక్ వ‌చ్చేసింది. బాషా రేంజ్ ఫ్లాష్‌బ్యాక్‌తో ఈ సినిమా అదిరిపోతుంద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత ఈ సినిమాను నిర్మించారు.

సెన్సార్ కంప్లీట్‌...

మా ఇంటి బంగారం సెన్సార్ పూర్త‌య్యింది. యూ ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. రెండు గంట‌ల 34 నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సెన్సార్ స‌భ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది.యాక్ష‌న్‌, కామెడీ అంశాల‌తో స‌మంత అద‌ర‌గొట్టింద‌ని అంటున్నారు. హీరోయిన్ పాత్ర చాలా కాలం పాటు గుర్తుండిపోయేలా ఉంటుంద‌ని స‌మాచారం. స‌మంత‌కు మంచి క‌మ్‌బ్యాక్ మూవీగా మా ఇంటి బంగారం నిల‌వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. రీసెంట్ టైమ్‌లో తెలుగులో వ‌చ్చిన బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇదంటూ టాక్ వినిపిస్తోంది.

బాషాతో లింక్‌..

మా ఇంటి బంగారం మూవీ ర‌జ‌నీకాంత్ బాషా ఫార్మెట్‌లో సాగుతుంద‌ని ప్ర‌మోష‌న్స్‌లో నందిని రెడ్డి చెప్పింది. బాషా స్టైల్‌లో హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ సీన్లు చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇలాంటి సీన్లు ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్‌లో ఏ హీరోయిన్‌కు ప‌డ‌లేదు అని నందిని రెడ్డి చెప్పింది.

మా ఇంటి బంగారం సినిమాలో శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్యలు కీల‌క పాత్ర‌లు పోషించారు. సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ అందించాడు.

Advertisement
Advertisement