Sai Pallavi | సాయిపల్లవి రిజెక్ట్ చేసిన మలయాళ సినిమాతో హిట్టు కొట్టిన మమితా బైజు
నివీన్ పాల్, మమితా బైజు జంటగా నటించిన మలయాళం మూవీ బెత్లేహెమ్ కుడుంబ యూనిట్ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ 110 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఈ మలయాళం మూవీలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ మమితా బైజు కాదు...సాయిపల్లవి అని ప్రమోషన్స్‌లో హీరో నివీన్ పాల్ పేర్కొన్నాడు.
Entertainment | Published On Aug 27, 2026, 5.26 pm IST
Sai Pallavi |నివీన్ పాల్ హీరోగా నటించిన మలయాళం మూవీ ప్రేమమ్ తోనే హీరోయిన్‌గా సాయిపల్లవి పరిచయమైంది. మలర్ పాత్రతో తొలి సినిమాతోనే దక్షిణాది ఆడియెన్స్‌ను మెప్పించింది. మలయాళ ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచిన ప్రేమమ్ తర్వాత దక్షిణాదిలో సాయిపల్లవి పేరు మారుమోగింది. మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రేమమ్ రిలీజ్ తర్వాత మలయాళం కంటే ఇతర భాషల్లో సాయిపల్లవికి ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. పదకొండేళ్ల కెరీర్‌లో మూడే మూడు మలయాళ సినిమాలు చేసింది సాయిపల్లవి. 2019లో వచ్చిన అథిరన్ తర్వాత మాలీవుడ్‌కు దూరమైంది.
ప్రేమమ్ హీరోతో...
ఏడేళ్ల తర్వాత ప్రేమమ్ హీరో సినిమాతోనే సాయిపల్లవి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. కానీ నాచురల్ బ్యూటీ ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. సాయిపల్లవి వదులుకున్న ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఫహాద్ ఫాజిల్ ప్రొడ్యూసర్...
నివీన్ పాల్, మమితాబైజు జంటగా నటించిన బెత్లేహెమ్ కుడుంబ యూనిట్ ఇటీవలే థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 110 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఈ మూవీని నిర్మించాడు. తనకంటే వయసులో చిన్నదైన ఓ యువతితో ప్రేమలో పడే ఓ వ్యక్తి కథతో ఈ సినిమా రూపొందింది.
మమితా బైజు కాదు...
బెత్లేహెమ్ కుడుంబ యూనిట్ హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ మమితాబైజు కాదు. సాయిపల్లవితో ఈ సినిమా చేయాలని దర్శకుడు గిరీష్ ఏడీ అనుకున్నారు. ఆమెకు కథ చెప్పారు. కొన్ని రోజుల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయి. ఇతర భాషల్లో ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల ఈ సినిమాకు డేట్స్ కేటాయించడం ఇబ్బందిగా మారడంతో సాయిపల్లవి ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మమితాబైజును హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ విషయాన్ని బెత్లేహెమ్ కుడుంబ యూనిట్ ప్రమోషన్స్‌లో నివీన్ పాల్ రివీల్ చేశాడు.
సంబంధిత వార్తలు

Malayalam OTT | ఓటీటీలోకి మైండ్ బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో రిలీజ్
ఆగస్టు 25, 2026

Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ – సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?
ఆగస్టు 20, 2026

Jana Nayagan OTT | అఫీషియల్ – ఓటీటీలోకి సీఎం విజయ్ చివరి మూవీ – తెలుగు ఫ్యాన్స్‌కు నిరాశే!
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Niranjan Reddy | కాంగ్రెస్ మోసాలతో అన్ని వర్గాలూ నష్టపోయాయి
- ●Mallikarjun Kharge | డీలిమిటేషన్‌పై చర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
- ●Bilibili | యూట్యూబ్‌కు పోటీ యాప్ బిలిబిలి బంపర్ ఆఫర్.. 1,000 వ్యూస్‌కు రూ.66..?
- ●Mir Alam Tank | ఫ్యామిలీ టూరిస్టు హబ్‌గా మీర్ ఆలం చెరువు
- ●Kiren Rijiju | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియలేదు : కిరణ్ రిజిజు
- ●Stock Markets | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 52 వారాల కనిష్టానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్..

Niranjan Reddy | కాంగ్రెస్ మోసాలతో అన్ని వర్గాలూ నష్టపోయాయి

Mallikarjun Kharge | డీలిమిటేషన్‌పై చర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

Bilibili | యూట్యూబ్‌కు పోటీ యాప్ బిలిబిలి బంపర్ ఆఫర్.. 1,000 వ్యూస్‌కు రూ.66..?

Mir Alam Tank | ఫ్యామిలీ టూరిస్టు హబ్‌గా మీర్ ఆలం చెరువు



