Sai Pallavi | పెళ్లికి ముందే రొమాన్స్ – మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి
సినిమాలు, పాత్రల ఎంపికలో కెరీర్ ఆరంభం నుంచి సాయిపల్లవి కొన్ని రూల్స్ ఫాలో అవుతోంది. రొమాంటిక్, గ్లామర్ రోల్స్‌ను రిజెక్ట్ చేస్తోంది. అశ్లీలత మోతుదు కాస్త ఎక్కువైనా ఆ సినిమాలను చేయనని చెప్పేస్తోంది. సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలపై తమిళ దర్శకుడు రత్నకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Entertainment | Published On Apr 25, 2026, 3.04 pm IST
Sai Pallavi | హీరోయిన్లు అంటే అందంగా ఉండాలి, స్క్రీన్‌పై గ్లామర్‌ను ఒలకబోయాలనే రూల్‌ను తిరగరాసింది సాయిపల్లవి. అందాల ప్రదర్శన చేయకుండా కూడా నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకోవచ్చని నిరూపించింది. చాలా మంది యంగ్ హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. కెరీర్ ఆరంభం నుంచి సినిమాల ఎంపికలో కొన్ని రూల్స్ ఫాలో అవుతోంది సాయిపల్లవి. గ్లామర్, రొమాన్స్ పరంగా లిమిట్స్ పెట్టుకుంది. ఆ హద్దులు దాటిన చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. సాయిపల్లవి వదులుకున్న సినిమాల్లో మణిరత్నం లాంటి దర్శకులు ఉన్నారట. మరికొన్ని సినిమాలు సూపర్ హిట్టు అయ్యాయట. అయినా ఆ పాత్రల విషయంలో సాయిపల్లవికి ఎలాంటి రిగ్రేట్స్ లేవట.
క్యారెక్టర్ నచ్చింది కానీ....
సాయిపల్లవి గురించి కోలీవుడ్ డైరెక్టర్ రత్నకుమార్ ఇటీవల 29 మూవీ ప్రమోషన్స్‌లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. తాను దర్శకత్వం వహించిన మీయాదమన్ సినిమాలో హీరోయిన్‌గా తొలుత సాయిపల్లవి అప్రోచ్ అయినట్లు రత్నకుమార్ చెప్పారు. నేను చెప్పిన కథ సాయిపల్లవికి చాలా నచ్చింది. కానీ అందులో కథాపరంగా పెళ్లికి ముందే హీరోహీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. వాటి విషయంలో మాత్రం అభ్యంతరం చెప్పింది. అలాంటి సీన్లు చేయడం తనకు ఇష్టం ఉండదని మీయాదమన్ సినిమాను సాయిపల్లవి రిజెక్ట్ చేసిందని రత్నకుమార్ అన్నారు. సాయిపల్లవి ప్లేస్‌లో ప్రియా భవానీ శంకర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నామని చెప్పారు. సినిమా పెద్ద హిట్టయ్యిందని చెప్పారు.
మణిరత్నం సినిమాలో...
సాయిపల్లవి వదులుకున్న సినిమాల్లో మణిరత్నం సినిమా కూడా ఉందట. కాట్రువెలియిదై (తెలుగులో చెలియా) హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకోవాలని మణిరత్నం అనుకున్నారట. కానీ పెళ్లి కాకుండానే తల్లిగా మారే క్యారెక్టర్ కావడం ఆ ఆఫర్‌ను సాయిపల్లవి వదులుకుందట. అప్పుడు మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి ఇటీవలే ఈ దిగ్గజ దర్శకుడితో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
బాలీవుడ్ మూవీస్...
ఈ ఏడాది సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఏక్ దిన్‌తో పాటు రామాయణ సినిమాలు చేస్తోంది. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఏక్ దిన్ మే 1న థియేటర్లలోకి రాబోతుంది. రామాయణ మూవీ దీపావళికి థియేటర్లలోకి రానుంది.
సంబంధిత వార్తలు

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



