త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rukmini Vasanth | రుక్మిణి వ‌సంత్ క‌ష్టాలు..! రెండు సినిమాల రిలీజ్ వాయిదే..!

Rukmini Vasanth | రుక్మిణి వసంత్‌ చివరిసారిగా కాంతార: చాప్టర్‌ 1 మూవీలో నటించింది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అయిన బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా ఘ‌న‌త సాధించింది. ఆ త‌ర్వాత రుక్మిణి వసంత్‌ పలు పాన్‌ ఇండియా చిత్రాలకు సైన్‌ చేసింది.

P

Entertainment | Published On Feb 4, 2026, 3.11 pm IST

Rukmini Vasanth | రుక్మిణి వ‌సంత్ క‌ష్టాలు..! రెండు సినిమాల రిలీజ్ వాయిదే..!
Advertisement

Rukmini Vasanth | రుక్మిణి వసంత్‌ చివరిసారిగా కాంతార: చాప్టర్‌ 1 మూవీలో నటించింది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అయిన బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా ఘ‌న‌త సాధించింది. ఆ త‌ర్వాత రుక్మిణి వసంత్‌ పలు పాన్‌ ఇండియా చిత్రాలకు సైన్‌ చేసింది. అయితే, ఈ రెండు సినిమాల రిలీజ్ విష‌యంలో జాప్యం జరుగుతోంది. కన్నడ సూపర్‌ స్టార్‌ యష్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్‌’. ఈ మూవీలో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, బాలీవుడ్‌ బ్యూటీలు కియారా అద్వారా, తారా సుతారియా, హుమా ఖురేషి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు.

అయితే, ఈ మూవీ రిలీజ్‌ వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నది. ఈ మూవీ టీజర్‌ ఇటీవల విడుదలైంది. ఇందులోని ఇంటిమేట్‌ సీన్స్‌ కారణంగా వివాదంలో చిక్కుకుంది. త్వరలోనే కొత్త తేదీని మేకర్స్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. అదే సమయంలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ‘డ్రాగన్‌’ మూవీలో నటించేందుకు రుక్మిణి సంతకం చేసింది. ఇప్పటి వరకు మేకర్స్‌ ఇంకా ప్రకటించినప్పటికీ.. ఈ కన్నడ బ్యూటీ ప్రాజెక్టులో భాగమవుతుందని పలు నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌పై కీలక సీన్స్‌ను చిత్రీకరిస్తున్నాడు. రుక్మిణి షూటింగ్‌లో చేరేందుకు ఇంకా సమయం ఉన్నది. వాస్తవానికి డ్రాగన్‌ మూవీని ఈ ఏడాది జూన్‌లో విడుదల కావాల్సి ఉంది. ఈ మూవీ సైతం ప‌డ‌నున్న‌ది. అన్నీ కుదిరితే 2026 చివ‌రి నాటికి లేకపోతే వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. సుకుమార్‌ దర్శకత్వంలో గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా మూవీ తెరకెక్కనున్నది. ఈ మూవీలో సైతం హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా మూవీని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ చిత్రాన్ని నిర్మిస్తోంది. శర్వాకు జోడీగా రుక్మిణిని ఫైనల్‌ చేసినట్లు టాలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. మార్చి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగనున్నట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్‌గా అప్‌డేట్ రానున్న‌ది.

Advertisement
Advertisement