Rukmini Vasanth | కాంతార హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ప్రేమలో పడిందా? అంటే ఔననే అంటున్నాయి సాండల్‌వుడ్ వర్గాలు. 2019లో వచ్చిన బీర్బల్ ట్రయాలజీ మూవీతో హీరోయిన్‌గా మారింది రుక్మిణి వసంత్. తొలి సినిమాలోనే గ్లామర్ తళుకులతో అదరగొట్టిన బ్యూటీ కన్నడ సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సప్తసాగరాలు దాటి సినిమాతో తనలో మంచి నటి కూడా ఉందని నిరూపించింది. గత ఏడాది రిలీజైన కాంతార చాఫ్టర్ వన్‌తో పాన్ ఇండియన్ లెవెల్‌లో రుక్మిణి వసంత్‌పేరు మారుమోగింది. ప్రస్తుతం యశ్ టాక్సిక్, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాల్లో నటిస్తోంది రుక్మిణి వసంత్. పాత ఫొటో... తాజాగా రుక్మిణి వసంత్ ప్రేమలో పడ్డట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. సిద్ధాంత్ నాగ్ అనే ఫొటోగ్రాఫర్‌తో రుక్మిణి వసంత్ దిగిన పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో సిద్ధాంత్‌ను ప్రేమగా కౌగిలించుకొని రుక్మిణి వసంత్ కనిపిస్తోంది. ఇందులో వారిద్దరి కెమిస్ట్రీ, బాండింగ్ చూస్తుంటే స్నేహానికి మించిన బంధం ఇద్దరి మధ్య ఉన్నట్లుగా కనిపిస్తోందని నెటిజన్లు చెబుతోన్నారు. రుక్మిణి బాయ్‌ఫ్రెండ్ అతడే కావచ్చునంటూ హార్ట్ ఎమోజీ గుర్తులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వైరల్ ఫొటో గురించి రుక్మిణి, సిద్దాంత్‌లలో ఎవరూ రియాక్ట్ కాలేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే... సిద్దాంత్ నాగ్ వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్ అని, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా మారకముందు నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఉన్నట్లు సమాచారం. ఐదారేళ్ల క్రితంరుక్మిణి వసంత్ షేర్ చేసిన చాలా ఫొటోల్లో సిద్ధాంత్ కనిపించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని అంటున్నారు. తన కెరీర్‌కు అడ్డు అనే ఈ లవ్‌స్టోరీని రుక్మిణి వసంత్ సీక్రెట్‌గా దాచినట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు నెటిజన్లు మాత్రం రుక్మిణి వసంత్, సిద్దాంత్ మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని అంటున్నారు. ఇటీవలే టాక్సిక్ మూవీ షూటింగ్‌ను పూర్తిచేసింది రుక్మిణి వసంత్. ఈ సినిమాలో మెల్లీసా అనే క్యారెక్టర్‌లో కనిపించబోతుంది. మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. త్వరలోనే రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.