Reba Monica John | ఐపీఎస్ ఆఫీసర్‌గా టాలీవుడ్ హీరోయిన్
సామజవరగమనా తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. మృత్యుంజయ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీలో రెబా మోనికా జాన్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.
Entertainment | Published On Feb 7, 2026, 9.01 pm IST
Reba Monica John | సామజవరగమనా మూవీతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది కోలీవుడ్ బ్యూటీ రెబా మోనికా జాన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ మూవీతోనే టాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది. సామజవరగమనా బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. ఈ సారి కామెడీ కాకుండా ఓ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు మృత్యుంజయ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఐపీఎస్‌గా...
మృత్యుంజయ్ మూవీ నుండి రెబా మోనికా జాన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. ఇందులో ఐపీఎస్ సీతా పరుశురామ్ అనే పాత్రలో రెబా మోనికా కనిపించబోతుంది. గత సినిమాలకు భిన్నంగా ఇందులో కంప్లీట్ సీరియస్ రోల్ చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఖాకీ డ్రెస్‌లో ఇంటెన్స్‌గా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ప్రయోగాత్మక పాత్రలో...
ఇందులో శ్రీవిష్ణు రోల్ కూడా ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగుతుందని అంటున్నారు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ గా తనపై ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా ప్రయోగాత్మక పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మృత్యుంజయ్ మూవీని సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు.విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. సామజవరగమనా కంటే ముందు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది రెమా మోనికా జాన్. ప్రస్తుతం దళపతి విజయ్ జననాయగన్‌లో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Reba Monica John | తల్లి కాబోతున్న శ్రీవిష్ణు హీరోయిన్ – బేబీ బంప్ ఫొటోలతో గుడ్‌న్యూస్…
మే 1, 2026

Mrithyunjay Review | మృత్యుంజయ్ రివ్యూ – కామెడీ హీరో శ్రీవిష్ణు చేసి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
మార్చి 6, 2026

Reba Monica John | రెబా మోనికా జాన్ డబుల్ ట్రీట్ – ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ – ఒకటి తెలుగు…మరోటి మలయాళం
మార్చి 5, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



