Mrithyunjay Review | మృత్యుంజయ్ రివ్యూ – కామెడీ హీరో శ్రీవిష్ణు చేసి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Mar 6, 2026, 8.35 am IST
Mrithyunjay Review |బ్యాక్ టూ బ్యాక్ కామెడీ సినిమాలతో వరుస విజయాలను అందుకుంటున్న శ్రీవిష్ణు తన జోనర్ మార్చి చేసిన సినిమా మృత్యుంజయ్. క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించాడు. రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో శ్రీవిష్ణు ఆడియెన్స్‌ను మెప్పించాడా? సుకుమార్ శిష్యుడు అతడికి హిట్టు ఇచ్చాడా? లేదా? అంటే?
కిల్లర్ కోసం అన్వేషణ...
క్రైమ్ రిపోర్టర్‌గా గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు జై (శ్రీవిష్ణు). కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఓ న్యూస్ పేపర్‌లో యాడ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయాల్సివస్తుంది. చనిపోయిన వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల నుంచి శ్రద్ధాంజలి యాడ్స్ తీసుకొస్తుంటాడు. అచ్యుత్ రావ్ అనే వ్యక్తి చనిపోవడంతో అతడి ఇంటికి వెళతాడు జై. కరెంట్ షాక్‌తో అతడు చనిపోయాడని జై తెలుసుకుంటాడు. తండ్రి గురించి అచ్యుత్‌రావ్ కూతురు పడుతోన్న బాధ జైని కదిలిస్తుంది. అచ్యుత్‌రావ్ చనిపోయిన కొద్ది రోజులకే అదే తరహాలో మరో వ్యక్తి చనిపోతాడు. మామూలు ప్రమాదాలుగానే ఈ రెండు కేసులను పోలీసులు భావిస్తారు. కానీ ప్రీప్లాన్‌డ్ మర్డర్స్ అని జై ఆరోపిస్తాడు. కానీ అతడి మాటలను ఎవరూ నమ్మరు. అసలైన హంతకుడిని జై ఎలా కనిపెట్టాడు. ఈ హత్యలకు సాధుకు (వీర్ ఆర్యన్) ఉన్న సంబంధమేమిటి? జై ఇన్వేస్టిగేషన్‌లో అతడికి ఐపీఎస్ ఆఫీసర్ సీతా పరశురామ్ (రెబా మోనికా జాన్) ఎలా అండగా నిలిచింది అన్నదే ఈ మూవీ కథ.
మలయాళంలో ఎక్కువ...
క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్లకు మలయాళం ఇండస్ట్రీ పెట్టింది పేరు. ఊహలకు అందని మలుపులతో డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎందుకుంటూ మలయాళ దర్శకులు రూపొందించిన ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. చిన్న చిన్న పాయింట్లతోనే భలే ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఆ తరహా కథాంశాలతో మన దగ్గర ఎందుకు సినిమాలు రావనే ప్రశ్న చాలా సార్లు వినిపిస్తుంటుంది. వాటికి కొంత వరకు మృత్యుంజయ్ సమాధానం ఇచ్చింది.
హీరో వర్సెస్ కిల్లర్...
చిన్న క్లూ కూడా దొరక్కుండా హత్యలు చేసే ఓ కిల్లర్... అందరిని భిన్నంగా ఆలోచించే ఓ హీరో...వారిద్దరి మధ్య పోరాటం చుట్టూ మృత్యుంజయ్ ఆసక్తిగా సాగుతుంది. యాడ్ ఎగ్జిక్యూటివ్‌గా జై పడే తిప్పలతో సాదాసీదాగా ఈ మూవీ మొదలవుతుంది. వరుసగా ఇద్దరు చనిపోవడం, వాటిని హత్యలుగా జై అనుమానించినప్పటి నుంచే కథ పరుగులు పెడుతుంది. కంటికి కనిపించని శత్రువును పట్టుకోవడానికి జై చేసే ప్రయత్నాలు, జై వేసే ఎత్తులను తిప్పి కొట్టే విలన్...వీరిద్దరి మైండ్ గేమ్ చుట్టూ చివరి వరకు కథ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. విలన్ ఎవరన్నది ముందే రివీల్ చేశాడు డైరెక్టర్. కానీ హీరో అతడిని ఎలా పట్టుకున్నాడన్నది మాత్రం ఆడియెన్స్ థ్రిల్లింగ్‌గా ఫీలయ్యేలా రాసుకున్నాడు. ట్విస్ట్‌లు బాగున్నాయి. చివరలో ఆ కిల్లర్‌కు మర్డర్స్ కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారనే మలుపు కూడా ఆకట్టుకుంది.
ఈ సినిమాకు రన్‌టైమ్ ప్లస్సయ్యింది. కేవలం రెండు గంటల రెండు నిమిషాల్లోనే సినిమాను ఎండ్ చేశారు. దాంతో ఎక్కడ సాగదీసిన ఫీలింగ్ కనిపించదు. హీరోయిన్ క్యారెక్టర్‌ను ఇంకాస్త బాగా రాసుకుంటే బాగుండేది.
ఇమేజ్‌కు భిన్నంగా...
జై పాత్రలో శ్రీవిష్ణు నటన బాగుంది. సీరియస్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. కామెడీ హీరోగా తనకున్న ఇమేజ్‌కు భిన్నంగా అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు ప్రయోగాలు చేయడం మంచిదే. విలన్ క్యారెక్టర్‌లో సెటిల్డ్ యాక్టింగ్‌తో వీర్ ఆర్యన్ అదరగొట్టాడు . హీరోకు ధీటుగా అతడి క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకున్నారు. హీరోయిన్లు అంటేనే లవ్ ట్రాక్‌లు, పాటల కోసమే ఉంటారనే రూల్‌ను ఈ సినిమాతో మార్చే ప్రయత్నం చేశారు మేకర్స్. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నంగా రెబా మోనికా జాన్ క్యారెక్టర్ సాగింది. బాలాదిత్య, రచ్చరవి, ఐశ్వర్యతో పాటు మిగిలిన వారి నటన పర్వాలేదనిపించింది. కాలభైరవ బీజీఎమ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. థ్రిల్లర్ మూవీ ఫీల్‌ను మరింత ఎలివేట్ చేసింది.
క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కు...
క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడేవారిని మృత్యుంజయ్ ఆకట్టుకుంది. కామెడీనే కాదు సీరియస్ కథలతో ప్రేక్షకులను మెప్పించగలనని శ్రీవిష్ణు ఈ సినిమాతో నిరూపించుకున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
సెప్టెంబర్ 2, 2026

Bhagyashri Borse | రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో మూవీ.. లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీకి ఛాన్స్..!
సెప్టెంబర్ 2, 2026

Chiranjeevi | సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడిపై చిరంజీవి ప్రశంసల జల్లు
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్‌గా రష్మిక మందన్న - దీపికా పడుకోణ్‌ను దాటేసిన నేషనల్ క్రష్
- ●AI Express flight | విమానం గాల్లో ఉండగా లగేజీ స్టోర్ నుంచి పొగలు
- ●MLA Raja Singh | కాంగ్రెస్ నేతల వాటాల గొడవ తేలకే కొండా సురేఖ రాజీనామా!
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్
- ●Revanth Reddy 1000 Days | 1000 డేస్ ఆఫ్ రేవంత్ సర్కార్: సంక్షేమమే శ్రీరామరక్ష.. గాంధీ భవన్లో కాంగ్రెస్ గ్రాండ్ సెలబ్రేషన్స్!
- ●KA Paul | అమ్మా కొండా సురేఖ! వేరే పార్టీలోకి వెళ్లొద్దు.. మీకు ప్రజాశాంతి పార్టీ ఉంది

Rashmika Mandanna | దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్‌గా రష్మిక మందన్న - దీపికా పడుకోణ్‌ను దాటేసిన నేషనల్ క్రష్

AI Express flight | విమానం గాల్లో ఉండగా లగేజీ స్టోర్ నుంచి పొగలు

MLA Raja Singh | కాంగ్రెస్ నేతల వాటాల గొడవ తేలకే కొండా సురేఖ రాజీనామా!

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్



