త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి ర‌వితేజ కామెడీ మూవీ

ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌జ్తి మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మార్చి 13 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌, డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా న‌టించారు.

N

Entertainment | Published On Mar 9, 2026, 2.24 pm IST

OTT | థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి ర‌వితేజ కామెడీ మూవీ
Advertisement

OTT | ర‌వితేజ హీరోగా న‌టించిన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీ ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి రాబోతుంది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత స్ట్రీమింగ్ డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. మార్చి 13న జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంతో పాటు మ‌రో నాలుగు భాష‌ల్లో ఈసినిమాను విడుదల అవుతుంద‌ని జీ5 ఓటీటీ ప్ర‌క‌టించింది.

కార‌ణం ఇదే...

ఫిబ్ర‌వ‌రిలోనే భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. నిర్మాత‌ల‌కు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో నెల‌కొన్న ఫైనాన్షియ‌ల్ ఈష్యూస్‌తో పాటు ఇత‌ర భాష‌ల‌ డ‌బ్బింగ్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డిలే అయ్యింద‌ని టాక్ వినిపిస్తోంది.
భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీకి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా డింపుల్ హ‌య‌తి, ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్లుగా న‌టించారు. సునీల్‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళీధ‌ర్‌గౌడ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఫెయిల్యూర్‌...

సంక్రాంతి కానుక‌గా భారీ పోటీ మ‌ధ్య థియేట‌ర్ల‌లో రిలీజైన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి మూవీ క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, కామెడీ ఆశించిన స్థాయిలో పండ‌క‌పోవ‌డంతో ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. మాస్ మ‌హారాజా అనే ట్యాగ్‌ను ప‌క్క‌న‌పెట్టి త‌న శైలికి భిన్నంగా ర‌వితేజ ఈ సినిమా చేశారు. కానీ అత‌డికి విజ‌యం మాత్రం ద‌క్క‌లేదు. భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తికి భీమ్స్ మ్యూజిక్ అందించాడు.

రామ్ క‌ష్టాలు...

రామ‌స‌త్య‌నారాయణ అలియాస్ రామ్‌ (ర‌వితేజ‌) త‌న‌ భార్య బాలామ‌ణితో (డింపుల్ హ‌య‌తి)క‌లిసి వైన్ బిజినెస్ చేస్తున్నాడు త‌న బ్రాండ్‌ను విస్త‌రించేక్ర‌మంలో స్పెయిన్‌కు చెందిన మాన‌స‌శెట్టిని (ఆషికా రంగ‌నాథ్‌) రామ్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. త‌న‌కు పెళ్ల‌యింద‌నే నిజాన్ని దాచిపెట్టి మాన‌స శెట్టికి ద‌గ్గ‌ర‌వుతాడు రామ్‌. భార్య ద‌గ్గ‌ర ఈ విష‌యం దాచిపెడ‌తాడు. రామ్‌ను వెతుక్కుంటూ మాన‌స ఎందుకు హైద‌రాబాద్ వ‌చ్చింది? రామ్‌, మాన‌స రిలేష‌న్ గురించి బాలామ‌ణికి తెలిసిందా? రామ్‌కు సాయం చేయ‌డానికి సుద‌ర్శ‌న్ (సునీల్‌), లీలా (వెన్నెల‌కిషోర్‌) ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు అన్న‌దే భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీ క‌థ‌.

Advertisement
Advertisement