త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ravi Basrur | ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’కి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ర‌వి బ‌స్రూర్‌

Ravi Basrur | జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘డ్రాగన్’ సంగీత దర్శకుడు ఎవరనేది ఇన్ని రోజులు స‌స్పెన్స్‌గా ఉండేది. ఈ విషయంపై స్పందించిన ప్ర‌శాంత్ నీల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

S

Movies | Published On Nov 4, 2026, 4.03 pm IST

Ravi Basrur | ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’కి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ర‌వి బ‌స్రూర్‌
Advertisement

Ravi Basrur | త్రినేత్ర న్యూస్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘డ్రాగన్’ సంగీత దర్శకుడు ఎవరనేది ఇన్ని రోజులు స‌స్పెన్స్‌గా ఉండేది. ఈ విషయంపై స్పందించిన ప్ర‌శాంత్ నీల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. డ్రాగ‌న్‌కు ర‌విబ‌స్రూర్ సంగీతం అందిస్తార‌ని ఆయ‌న తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో గ‌తంలో వ‌చ్చిన కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 చిత్రాల‌కు ర‌వి బ‌స్రూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘డ్రాగన్’ లో ఎన్టీఆర్‌ సరసన రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జూన్‌11న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అనిల్‌ కపూర్, బిజూ మీన‌న్‌, ఖుష్బూ సుంద‌ర్‌, గురు సోమ‌సుంద‌రం, అశుతోష్ రానా, సిద్ధాంత్ గుప్తా, ప్ర‌భాస్ శ్రీను తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నారు.

ట్యాగ్స్:

Dragon MovieNtrRavi BasrurTelugu CinemaTollywood
Advertisement
Advertisement