త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood | బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్ల‌కు ఫుల్ డిమాండ్ – సంద‌డంతా వీరిదే

ద‌క్షిణాది హీరోయిన్ల‌కు బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ నెల‌కొంది. ర‌ష్మిక మంద‌న్న హిందీలో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. సాయిప‌ల్ల‌వి, శ్రీలీల‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు.

N

Entertainment | Published On Jan 25, 2026, 11.53 am IST

Bollywood | బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్ల‌కు ఫుల్ డిమాండ్ – సంద‌డంతా వీరిదే
Advertisement

Bollywood | గ‌తంలో ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీకి బాలీవుడ్‌ను గ‌ర్వ‌కార‌ణంగా చెప్పుకునేవారు. బాలీవుడ్ త‌ర్వాతే టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు మిగిలిన ఇండ‌స్ట్రీలు ఉండేవి. అవార్డులు, రికార్డులు, క‌లెక్ష‌న్స్‌ ఏవైనా బాలీవుడ్ త‌ర్వాతే అనే ప‌రిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఢిఫ‌రెంట్ కంటెంట్‌తో ద‌క్షిణాది సినిమాలు స‌త్తా చాటుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాల‌కు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో క్రేజ్ ఏర్ప‌డింది. తెలుగు నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే అన్ని భాష‌ల ఆడియెన్స్ ఎదురుచూసే ప‌రిస్థితి నెల‌కొంది.

ర‌ష్మిక టాప్‌...

పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌తో తెలుగు సినిమాల‌కే కాకుండా టాలీవుడ్‌ హీరోహీరోయిన్ల కు ఇమేజ్‌, స్టార్‌డ‌మ్ తో పాటు అవ‌కాశాలు పెరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ద‌క్షిణాది హీరోయిన్ల‌కు ఫుల్ డిమాండ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం హిందీలో ర‌ష్మిక మంద‌న్న టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. 2025లో ఛావా, థామా సినిమాల‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను అందుకుంది. ఛావా 900 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌తో బాలీవుడ్ హిస్ట‌రీలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాలో ఏసుబాయి పాత్ర‌లో ర‌ష్మిక అద్వితీయ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. ప్ర‌స్తుతం కాక్ టెయిల్ 2తో పాటు హిందీలో మ‌రో రెండు సినిమాల‌కు ర‌ష్మిక గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.
స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా పూజా హెగ్డే కూడా బాలీవుడ్‌లో వ‌రుస‌గా స్టార్స్‌తో జోడీ క‌డుతోంది. గ‌త ఏడాది షాహిద్‌క‌పూర్‌తో దేవా సినిమా చేసింది. ప్ర‌స్తుతం వ‌రుణ్ ధావ‌న్‌ హై జ‌వానీ తో ఇష్క్‌ హోనా హై సినిమాతో త్వ‌ర‌లోనే బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది.
బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్‌. ద‌ళ‌ప‌తి విజ‌య్ తేరీ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయినా కీర్తి మాత్రం హిందీ ఇండ‌స్ట్రీలో బిజీ అయ్యింది. ప్ర‌స్తుతం రాజ్‌కుమార్ రావ్‌తో ఓ సినిమా చేస్తోంది. హిందీలో కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో న‌టించిన అక్క వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉంది.

హిందీలోకి ఎంట్రీ...

ఈ ఏడాది ద‌క్షిణాది అగ్ర‌నాయిక‌లు కొంద‌రు బాలీవుడ్‌లోకి హీరోయిన్లుగా అరంగేట్రం చేయ‌బోతున్నారు. హీరోయిన్ అంటే గ్లామ‌ర‌స్‌గా ఉండాల‌నే రూల్‌ను తిర‌గ‌రాసింది సాయిప‌ల్ల‌వి. యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర‌ల‌తో అగ్ర నాయిక‌గా ఎదిగి న‌వ‌త‌రం నాయిక‌ల‌కు స్ఫూర్తిగా నిలిచిన సాయిప‌ల్ల‌వి ఈ ఏడాది హిందీ ఇండ‌స్ట్రీలో తొలి అడుగు వేయ‌బోతుంది. ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ఏక్ దిన్ మూవీలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్యూర్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీ మే 1న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. ఏక్ దిన్‌తో పాటు హిందీలో రామాయ‌ణ సినిమా కూడా చేస్తోంది సాయిప‌ల్ల‌వి. దాదాపు నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్న ఈ మైథాల‌జీ మూవీలో సీత‌గా సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతుంది.

శ్రీలీల...మూడు సినిమాలు...

ఆషికి 3 మూవీతో సౌత్ సెన్సేష‌న్ శ్రీలీల కూడా బాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతుంది. . కార్తీక్ ఆర్య‌న్ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. తొలి సినిమా రిలీజ్ కాకుండా బాలీవుడ్‌లో శ్రీలీల మ‌రో రెండు ఆఫ‌ర్లు అందుకున్న‌ట్లు స‌మాచారం.
లోక ఛాప్ట‌ర్ వ‌న్ హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ కూడా బాలీవుడ్‌లో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా న‌టిస్తోన్న జాంబీ థ్రిల్ల‌ర్ మూవీ ప్ర‌ళ‌య్‌లో క‌ళ్యాణి హీరోయిన్‌గా న‌టిస్తోంది. కృతి శెట్టి, మీనాక్షి చౌద‌రి కూడా బాలీవుడ్‌లో ఈ ఏడాది అడుగుపెట్ట‌బోతున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement